Writer K Vijayendra Prasad Check Bounce case dismissed

Writer k vijayendra prasad check bounce case dismissed

K. Vijayendra Prasad Check Bounce case dismissed, K. Vijayendra Prasad Check Bounce case finalised, K. Vijayendra Prasad Check Bounce case, K. Vijayendra Prasad Check Bounce, K. Vijayendra Prasad court issue, K. Vijayendra Prasad

Writer K Vijayendra Prasad Check Bounce case dismissed: Director SS Rajamouli father, Baahubali film story writer K. Vijayendra Prasad Check Bounce case dismissed.

‘బాహుబలి’ రచయితపై చెక్ బౌన్స్ కేసు కొట్టివేత

Posted: 11/20/2015 03:42 PM IST
Writer k vijayendra prasad check bounce case dismissed

తెలుగు సినీ రచయిత, దర్శకుడు కె. విజయేంద్ర ప్రసాద్ కు చెక్ బౌన్స్ కేసు నుంచి విముక్తి లభించింది. విజయేంద్ర ప్రసాద్ పై పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్ రావు చెక్ బౌన్స్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై యలమంచిలి AJFCM కోర్టు తీర్పునిస్తూ చెక్ బౌన్స్ కేసును కొట్టివేసింది.

చెంగల వెంకట్రావుకు 2011 మే 16న విజయేంద్ర ప్రసాద్ 30లక్షలకు ఆంధ్రాబ్యాంకు చెక్కు ఇచ్చాడు. అయితే ఆ చెక్కు చెల్లకపోవడంతో AJFCM కోర్టులో కేసు దాఖలు చేాసరు. నాలుగేళ్లు విచారణ జరిపి, వాదోపవాదనలు అయిన తర్వాత తాజాగా ఆధారాలు సరిగ్గా లేని కారణంగా ఈ కేసు కొట్టేస్తున్నట్లుగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో విజయేంద్ర ప్రసాద్ ను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది.

విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే రాసిన ‘బాహుబలి’, ‘భజరంగీ భైజాన్’ చిత్రాలు భారీ విజయం సాధించి, కలెక్షన్ల మోత మోగించాయి. అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలకు కూడా విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ప్రస్తుతం ఆయన రాసిన ‘బాహుబలి2’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K. Vijayendra Prasad  Check bounce case  Baahubali2  News  stills  

Other Articles