Richa Gangopadhyay says Goodbye to Movies

Richa gangopadhyay says goodbye to movies

Richa Gangopadhyay says goodbye to films, Richa Gangopadhyay latest tweets, Richa Gangopadhyay tweets, Richa Gangopadhyay stills, Richa Gangopadhyay news, Richa Gangopadhyay movie news, Richa Gangopadhyay hot stills, Richa Gangopadhyay hot videos

Richa Gangopadhyay says Goodbye to Movies: Tollywood hot heroine Richa Gangopadhyay say Goodbye to Films. Richa Gangopadhyay enters into tollywood with leader film. Richa Gangopadhyay latest stills, gallery.

మిరపకాయ్ భామకు చిరాకేసి గుడ్ బై చెప్పేసింది!

Posted: 11/18/2015 12:28 PM IST
Richa gangopadhyay says goodbye to movies

‘లీడర్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కత్తిలాంటి భామ రిచా గంగోపాధ్యాయ్... ఆ తర్వాత వచ్చిన ‘మిరపకాయ్’ సినిమాతో భారీ హిట్టును సొంతం చేసుకుంది. ఆ తర్వాత తమిళంలో ధనుష్ సరసన ‘మయక్కం ఎన్న’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో పాటు రిచాకు బోల్డన్నీ అవార్డులు, రివార్డులను తెచ్చిపెట్టింది.

దీంతో తమిళం, తెలుగు భాషలలో ఆఫర్లు ఎక్కువైనప్పటికీ, చాలా సెలెక్టివ్ గా సినిమాలను చేసింది. ఈ అమ్మడు గ్లామర్ పరంగా సినిమాకు చాలా ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. యువత కోరుకునే పిచ్చెక్కించే గ్లామర్ ఈ అమ్మడి సొంతం. ‘మిరపకాయ్’ సినిమాలో రిచా ఓ హాట్ సాంగ్ లో తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కించేసింది.

కత్తిలాంటి ఫిగరున్న బాడీతో ఈ అమ్మడు కుర్రకారుకు మతిపోగొట్టేసింది. అయితే రిచా నటించిన చివరి చిత్రం ‘భాయ్’. ఈ సినిమా తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లింది. కానీ ఒక్కసారి వెండితెర మీద కనిపించిన హీరోయిన్.. సినిమాలు ఆపేస్తే జనాలు ఊరికే ఉంటారా చెప్పండి. ‘మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడొస్తారండి?’ అంటూ ఎక్కడ కనిపిస్తే అక్కడ అడగడం మాములే.


Video Courtesy : iDream Filmnagar

అలాంటి ప్రశ్నలను సమాధానం చెప్పి, చెప్పి రిచాకు చిరాకు వచ్చేసినట్లుంది. దీంతో సినిమాలకు స్వస్తి పలికేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఇంకోసారి మీ కొత్త సినిమా ఎప్పడు అంటూ అడగవద్దంటూ రిచా ట్విట్టర్లో ప్రకటించింది. అంతే కాకుండా సినిమాలు ఛాన్స్ వల్ల వచ్చాయి... కానీ వాటిని తాను ఛాయిస్ కింద వదిలేసినట్లుగా రిచా ట్వీట్ చేసింది.

ఈ అమ్మడు తీసుకున్న నిర్ణయంపై రిచా ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు. మరి ఈ అమ్మడు మనసు మార్చుకొని మళ్లీ సినిమాల్లో నటిస్తుందో లేక పూర్తిగా సినిమాలకు దూరమవుతుందో చూడాలి. ఏదేమైనా రిచా ఇంకోసారి ఆలోచించి వుండుంటే బాగుండేది. ఇలాంటి హాట్ బ్యూటీ మరోసారి వెండితెర మీద కనిపిస్తే కుర్రకారుకి పండగే పండగ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Richa Gangopadhyay  Goodbye films  Quite  Hot stills  Tweets  

Other Articles