sai kumar turns as a producer for his sons movie garam

Sai kumar takes over garam

Aadi, Sai Kumar, Garam, Rajkumar, Seethamma Andalu Ramayya Sitraalu, sai kumar, producer, surekha, garam, Aadi, Adha sharma, tollywood news

After original producer Rajkumar backed out of the project following financial issues, actor Sai Kumar has stepped in to monitor the production activities of ‘Garam’.

తనయుడి కోసం తండ్రి కొత్త అవతారం..!

Posted: 11/15/2015 07:18 PM IST
Sai kumar takes over garam

నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన నటుడు సాయికుమార్. డబ్బింగ్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, విలన్గా అలరించిన సాయి కుమార్, ఇప్పుడు తన తనయుడి  కోసం ఆయన మరో కొత్త అవతారం ఎత్తాడు. హీరోగా ప్రూవ్ చేసుకుని తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కకున్న తన తనయుడు ఆది కోసం సాయ్ కుమార్ మరో అవతారం ఎత్తనున్నాడు. అదే నిర్మాత అవతారం. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించే పని మధ్యలోనే నిర్మాత జంప్ కావడంతో సినిమాను పూర్తి చేసే బాధ్యతలను సాయికుమార్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి తన సతీమణి సురేఖను నిర్మాతగా మార్చారు సాయికుమార్.

ఆదికి జంటగా ఆదాశర్మ నటిస్తున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇంట్రస్టింగ్ పాయింట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆది కెరీర్కు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాడు సాయికుమార్. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, రొమాన్స్ లాంటి అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతేకాదు సినిమా రిలీజ్ విషయంలో కూడా బడా డిస్ట్రిబ్యూటర్స్ సాయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి నటుడిగా మంచి విజయాలు సాధించిన సాయికుమార్, నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని ఆశించి అల్ ధి బెస్ట్ చెబుదాం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai kumar  producer  surekha  garam  Aadi  Adha sharma  tollywood news  

Other Articles