Nagarjuna in Akhil Movie Success Meet

Nagarjuna in akhil movie success meet

Akhil Movie Success Meet, Akhil Success Meet, Akhil Movie Collections, Akhil Movie Reviews, Akhil Movie stills, Akhil Movie news, Akhil Movie updates, Akhil Movie details, Akhil

Nagarjuna in Akhil Movie Success Meet: Akkineni Akhil latest film Akhil Released on diwali special 11 november. Akhil Movie Success Meet. akhil, nagarjuna, sayesha

అఖిల్ కు కూర్చోబెట్టి చెబుతాడట!

Posted: 11/13/2015 10:20 AM IST
Nagarjuna in akhil movie success meet

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘అఖిల్’ సినిమా దీపావళి సంధర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మించిన ఈ సినిమాలో అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను గురువారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో నాగార్జున, అఖిల్, సయేశా, వి.వి.వినాయక్, నితిన్, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా అఖిల్ మాట్లాడుతూ... అక్కినేని అభిమానులంతా హ్యాపీగా వున్నారు. వారి ఆనందమే నా ఆనందం. నిన్న కాస్త స్ట్రెస్ గా వున్న మాట నిజమే. ఇవాళ ఇంకా ట్రాన్స్ లో వున్నాను. ఈ నెంబర్లు, కలెక్షన్లు నాకు కొత్తగా వున్నాయి. వీటన్నిటీని ఆస్వాదిస్తున్నాను. సినిమాను ఆదరిస్తున్న తెలుగువారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.

నాగార్జున మాట్లాడుతూ... అఖిల్ ను అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను అమల చాలా హ్యాపీగా వున్నాం. నిన్నటి నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సినిమాను ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్న వారికి ధన్యవాదాలు. తొలిరోజు షేర్ 10కోట్లంటే ఆశ్చర్యంగా వుంది. నేను అఖిల్ సినిమాను పూర్తిగా చూసాను. అఖిల్ కు కొన్ని చెప్పాలి. కూర్చోబెట్టి చెబుతాను. తన డాన్సులు చేసి షాక్ అయ్యాను. అమల మంచి డాన్సర్. తన జీన్స్ కూడా అఖిల్ కు వచ్చాయి అని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Akhil  Success Meet  Collections  Reviews  Stills  

Other Articles