Loafer Movie First Look Response | Varun Tej | Disha Patani | Puri Jagannadh

Loafer movie first look response

Varun Tej Loafer Movie First Look, Loafer Movie First Look, Varun Tej Loafer Movie posters, Loafer Movie stills, Loafer Movie news, Loafer Posters, Varun Tej Movie news, Varun Tej movies, Varun Tej stills, Varun Tej

Loafer Movie First Look Response: Director Puri Jagannadh latest film Loafer. Varun Tej, Disha patani acts in lead roles. This film first look posters released.

వరుణ్ లోఫర్ కు రెస్పాన్స్ అదుర్స్

Posted: 11/09/2015 10:28 AM IST
Loafer movie first look response

'ముకుంద', 'కంచె' వంటి విభిన్న చిత్రాలలో నటించి, తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లోఫర్’. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఈ పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. గతంలో పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్’, ‘పోకిరి’, ‘చిరుత’, ‘దేశముదురు’, ‘టెంపర్’ చిత్రాలు ఆ హీరోలకు ఎలాంటి పేరును తెచ్చిపెట్టి విజయం సాధించాయో.. ‘లోఫర్’ సినిమాకు కూడా వరుణ్ కు అలాంటి మంచి గుర్తింపు ఈ సినిమాతో రాబోతుందని పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ ''వరుణ్‌ తేజ్‌, పూరి జగన్నాథ్‌ల ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మా 'లోఫర్‌' చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశాం. ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వరుణ్‌ చాలా డిఫరెంట్‌గా వున్నాడని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌టైమ్‌ చేస్తున్న మాస్‌ ఫిల్మ్‌ ఇది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మదర్‌ సెంటిమెంట్‌, హై యాక్షన్‌ ఈ చిత్రంలో వుంటుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ మాసీగా వుంటుంది. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో రవితేజకి ఇడియట్‌, మహేష్‌కి పోకిరి, ఎన్టీఆర్‌కి టెంపర్‌, చరణ్‌కి చిరుతల, బన్నికి దేశముదురు ఎలా మాస్‌ సినిమాలు అయ్యాయో అలా వరుణ్‌తేజ్‌కి 'లోఫర్‌' మంచి మాస్‌ సినిమా అవుతుంది. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో, సినిమా విడుదల తేదీలను అతి త్వరలోనే ప్రకటిస్తాం'' అన్నారు.

వరుణ్‌తేజ్‌, దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌, టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.ఎ.కుమార్‌ వర్మ, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: కె.యస్‌.రాజు, గల్లా రమేష్‌, కిషోర్‌ కృష్ణ, కో డైరెక్టర్‌: శివరామకృష్ణ, కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌, ఫైట్స్‌: విజయ్‌, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సమర్పణ: సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, నిర్మాతలు: సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Loafer  First Look  Puri Jagannadh  News  

Other Articles