Varun Tej Loafer Theatrical Trailer | puri jagannadh | disha patani

Varun tej loafer theatrical trailer

Varun Tej Loafer Movie Theatrical Trailer, Loafer Movie First Look, Varun Tej Loafer Movie posters, Loafer Movie stills, Loafer Movie news, Loafer Posters, Varun Tej Movie news, Varun Tej movies, Varun Tej stills, Varun Tej

Varun Tej Loafer Theatrical Trailer: Director Puri Jagannadh latest film Loafer. Varun Tej, Disha patani acts in lead roles. This film first look posters released. Loafer Movie Theatrical Trailer Released.

ట్రైలర్ : ఈ ‘లోఫర్’ వేగాన్ని అందుకోవడం చాలా కష్టమయా!

Posted: 11/09/2015 10:21 AM IST
Varun tej loafer theatrical trailer

టాలీవుడ్ ఎనర్జిటిక్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లోఫర్’. ‘ముకుంద’, ‘కంచె’ చిత్రాల తర్వాత వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ నిర్మిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్లు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా థియేటర్ ట్రైలర్ ను నేడు ఉదయం 9:24లకు విడుదల చేసారు. ఈ టీజర్ లో వరుణ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. వరుణ్ గతచిత్రాల కంటే ‘లోఫర్’ సినిమాలో చాలా మెచ్యుర్డ్ గా నటించినట్లుగా కనిపిస్తుంది.

స్టైలిష్ మాస్ లుక్ లో అదరగొట్టేసాడు. ఇందులో వరుణ్ డైలాగ్ డెలివరీ సూపర్బ్. రేవతి, పోసాని కృష్ణమురళిలు వరుణ్ కు తల్లితండ్రుల పాత్రలలో నటిస్తున్నారు. మొత్తానికి ‘లోఫర్’ ట్రైలర్ సిరిగిపోయింది. వరుణ్ తో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఒక్క ట్రైలర్ చూస్తుంటేనే ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తోందంటే... మరి సినిమా విడుదలైతే ఇంకెంత రచ్చ రచ్చ చేయనుందో చూడాలి.

కమర్షియల్ ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. సినిమాను వచ్చే ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Puri Jagannadh  Loafer  Theatrical Trailer  Posters  News  

Other Articles