Suresh Babu | Meets | IT Minister | KTR

Suresh babu meets it minister ktr

Producer Suresh Babu Meets IT Minister KTR, Suresh Babu Meets KTR, Suresh Babu Meets IT Minister, Suresh Babu KTR, Suresh Babu talks about piracy, Suresh Babu latest news, Suresh Babu movies, Suresh Babu

Suresh Babu Meets IT Minister KTR: Tollywood Producer Suresh Babu Meets IT Minister KTR about Piracy Issues.

పైరసీపై కేటీఆర్ తో సురేష్ బాబు చర్చలు

Posted: 10/28/2015 03:25 PM IST
Suresh babu meets it minister ktr

తెలుగు సినీ ఇండస్ట్రీని కంగారు పెడుతున్న వైరస్ పైరసీ. ఏ సినిమా విడుదలయిన కూడా కొన్ని గంటల్లోనే ఆ సినిమాకు సంబంధించిన పైరసీ పలు వెబ్ సైట్లు, ఇంటర్నెట్ లలో దర్శనమిచ్చేస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటే పైరసీదారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా సినిమాలను పైరసీ చేసేస్తున్నారు.

అయితే ఈ విషయంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ను కలిసారు. సురేష్ బాబుతో కలిసి మరికొంత మంది సినీరంగ ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి కేటీఆర్ కు తెలియజేసారు. ఈ విషయంపై కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు.

కేటీఆర్ తో సమావేశం అనంతరం సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంత్రి కేటీఆర్ కు తెలియజేసామని, ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. పైరసీని నిర్మూలించడానికి తమ వంతు సహకారం అందిస్తామని, ఇందుకోసం కొత్త పాలసీని తీసుకొస్తామని కేటీఆర్ తెలియజేసినట్లుగా సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా ప్రస్తుతం సినిమా పైరసీలను అరికట్టడానికి 200 వెబ్ సైట్లు పనిచేస్తున్నాయని, ఈ పైరసీ కారణంగా గత 9 నెలల్లో పరిశ్రమకు 350 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ పైరసీ నిర్మూలనకు మంత్రి కేటీఆర్ ఎలాంటి చర్యలు చేపట్టనున్నారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Babu  Meets  IT Minister  KTR  Piracy  stills  

Other Articles