Raghava Lawrence | Naaga Movie | Telugu Rights | Mondi Shiva Gundu Shiva

Raghava lawrence naaga telugu movie rights

Raghava Lawrence Naaga Movie Telugu Rights, Mondi Shiva Gundu Shiva Movie First Look, Raghava Lawrence Naaga Posters, Raghava Lawrence Naaga movie posters, Raghava Lawrence Naaga First look, Raghava Lawrence movie news, Raghava Lawrence latest stills, Raghava Lawrence posters

Raghava Lawrence Naaga Telugu Movie Rights: Director Raghava Lawrence Upcoming films Mondi Shiva Gundu Shiva and Naaga. This Movies First Look Posters Released.

లారెన్స్ దెయ్యాల సినిమాలకు పండగ ఆఫర్లు

Posted: 10/28/2015 04:22 PM IST
Raghava lawrence naaga telugu movie rights

హర్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు రాఘవ లారెన్స్ గతకొద్ది కాలంగా హర్రర్ చిత్రాలనే తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ‘ముని’, ‘కాంచన’, ‘గంగ’.. ఇలా వరుసగా విజయం సాధిస్తుండటంతో హర్రర్ సినిమాలపై మంచి పట్టును సాధించాడు లారెన్స్. గతంలో లారెన్స్ తెరకెక్కించిన ‘ముని’ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ‘కాంచన’, ‘గంగ’ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలు కూడా భారీ విజయం సాధించాయి.

ప్రస్తుతం మరో రెండు హర్రర్ సినిమాలతో ఒకేసారి దాడిచేయనున్నాడు. ఇందులో ఒకటి ‘మొండి శివ గుండు శివ’. రెండవది ‘నాగ’(తమిళంలో). అయితే ప్రస్తుతం ‘నాగ’ సినిమాను తెలుగులో ‘భైరవ’ అనే పేరుతో విడుదల చేయడానికి లారెన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తెలుగు హక్కులను అమ్మే ప్రయత్నంలో వున్నాడు. లారెన్స్ తన గత సినిమాల విజయాల వల్ల ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది. దీంతో ‘భైరవ’ చిత్ర హక్కులకు భారీ రేటును ఫిక్స్ చేసేసాడు.

పండగకు ముందు ఒకరేటు.. పండగ తర్వాత ఒకరేటు అన్నట్లుగా... ఈ సినిమా కోసం లారెన్స్ స్పెషల్ ఆఫర్ పెట్టాడట. ‘భైరవ’ హక్కులను ఇపుడే దక్కించుకుంటే కాస్త రేటు తగ్గే అవకాశం వుందని, ఒకవేళ సినిమా విడుదల సమయంలో దక్కించుకుంటే అపుడు రేటు మరింత ఎక్కువగా వుంటుందని లారెన్స్ ఆఫర్ ఇచ్చేసాడట. ప్రస్తుతం ‘భైరవ’ హక్కులను 20కోట్లకు ఆఫర్ చేసినట్లుగా తెలిసింది. దీంతో ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దనే వుద్దేశ్యంతో ఇప్పటికే చాలా మంది నిర్మాతలు ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మరి ఈ సినిమా ఎలా వుండబోతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles