actress asin denies rumours on marriage date | rahul sharma | bollywood gossips | tollywood updates

Actress asin denies rumours on marriage date rahul sharma bollywood gossips

asin news, asin latest news, asin updates, asin photo shoot, asin marriage, asin rahul marriage, asin marriage date, asin gossips

actress asin denies rumours on marriage date rahul sharma bollywood gossips : actress asin denies rumours on marriage date she told that they didn't fix their engagement yet.

నిన్న అవునంది.. ఇవాళ కాదంది.. క్లారిటీ లోపించింది..

Posted: 10/26/2015 03:05 PM IST
Actress asin denies rumours on marriage date rahul sharma bollywood gossips

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన హీరోయిన్ అసిన్ త్వరలోనే రాహుల్ శర్మను వివాహం చేసుకోబోతున్నట్లు విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ఈమె పెళ్లి తేదీకి సంబంధించిన వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలయ్యాయి. నవంబర్ 26వ తేదీన అసిన్, రాహుల్ వివాహం ఢిల్లీలో ఘనంగా జరగనుందని వార్తలు వెలుగులోకి వచ్చాయి.  ఇప్పటికే ఈ జంట ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నట్లు వార్తలొచ్చాయి.  అంతేకాదు.. 26న పెళ్లికాగా, 27వ తేదీన ఢిల్లీలోని వెస్ట్ ఎండ్ గ్రీన్స్ ఫార్మ్‌హౌజ్‌లో ఈ జంట అతిథులకు రిసెప్షన్ ఇవ్వనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే.. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆసిన్ తాజాగా వెల్లడించింది.

తన వివాహ తేదీపై మీడియాలో వచ్చిన వార్తలను అసిన్ తోసిపుచ్చింది. వచ్చే నెలలో తాను పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. ‘ఇది నిజంగా నవ్వు తెప్పించే వార్త. మేమింకా ముహూర్తమే పెట్టుకోలేదు. ఇంతలోనే.. మీడియా నా పెళ్లి తేదీపై గందరగోళం సృష్టిస్తోంది. నేను అంగీకరించిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఇంకా ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. అవి పూర్తి అయిన తర్వాతే మా పెళ్లి జరుగుతుంది. పెళ్లి ఎప్పుడనేది నేను చెప్పేవరకు ఓపిక పట్టండి. అంతేగానీ అనవసరంగా వార్తలు రాస్తూ.. రాద్ధాంతం సృష్టించకండి.. ప్లీజ్’ అని మీడియాను ఆసిన్ కోరింది. మైక్రోమాక్స్ సహ స్థాపకుడైన రాహుల్‌ శర్మను ఆసిన్ పెళ్లిచేసుకోనుంది.

ఇదిలావుండగా.. నేటితో ఆసిన్ 31వ పడిలోకి అడుగుపెడుతోంది. బర్త్ డే సెలబ్రేషన్ కోసం కాబోయే వధూవరులు ఇద్దరూ గుట్టుచప్పుడు కాకుండా గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లారని ఒకటే వార్తలు. అంతేకాదు.. తనకు కాబోయే భార్యకు రాహుల్‌ శర్మ ఖరీదైన ఉంగరం కూడా బహూకరించనున్నాడని సమాచారం. ఈ బర్త్ డే వేడుకలు గుర్తుండిపోయేలా వారిరువురి రహస్యంగా పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asin rahul marraige  bollywood gossips  

Other Articles