gopichand latest movie title fixed as soukyam in which regina is playing actress role | tollywood news

Gopichand latest movie soukyam story and updates

gopichand latest news, gopichand soukyam movie, soukyam movie updates, gopichand movies, regina cassandra, regina updates

gopichand latest movie title fixed as soukyam : the latest updates of gopichand latest movie soukyam which is directed by ravikumar.

నలుగురి ‘సౌఖ్యం’ కోసం పాటుపడుతున్న గోపీచంద్

Posted: 10/26/2015 01:44 PM IST
Gopichand latest movie soukyam story and updates

టాలీవుడ్ మాచోమ్యాన్ గా పేరుగాంచిన గోపీచంద్.. ఇప్పుడు నలుగురి సంతోషం కోసం పాటుపడుతున్నాడు. ఇతరుల ఆనందం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా వున్నానంటూ ముందుకొస్తున్నాడు. అయితే.. నలుగురి సౌఖ్యం కోసం అతడు రౌడీలను కొడుతూ భారీ యాక్షన్ చేస్తాడా..? అలాకాకుండా తనలో దాగిన కమెడియన్ ని బట్టబయలు చేసి ఎంటర్టైన్ మెంట్ చేస్తాడా..? అనేది రహస్యంగా మారింది. ఈ వివరాలు తెలియాలంటే.. త్వరలోనే విడుదల కాబోతున్న గోపిచంద్ సినిమాను వెండితెరపై చూడాల్సిందేనని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

‘సాహసం’, ‘లౌక్యం’, ‘జిల్’ హ్యాట్రిక్ విజయంతో ఫుల్ జోష్ లో వున్న గోపీచంద్.. ప్రస్తుతం ఎ.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సౌఖ్యం’ టైటిల్‌ను ఖరారు చేశారు. తొలుత ఈ మూవీ టైటిల్ కి సంబంధించి గతంలో కొన్ని ప్రచారాలు జరిగాయి కానీ.. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని యూనిట్ పేర్కొంది. ఇంకా టైటిల్ ఖరారు కాలేదని అప్పట్లో దర్శకనిర్మాతలు చెప్పారు. తాజాగా కొన్ని టైటిల్స్ ని పరిశీలించిన అనంతరం ‘సౌఖ్యం’ ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ సినిమాలో హీరోకి హెల్పింగ్ నేచుర్ ఎక్కువగా వుంటుంది కాబట్టి.. స్టోరీకి తగ్గట్టే ఆ టైటిల్ ని ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమాగురించి నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘మనుషుల మధ్య అనుబంధాలను స్పృశించే సినిమా ఇది. రవికుమార్-గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన  ‘యజ్ఞం’ ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునే విధంగా ఈ చిత్రం ఉంటుంది. టాకీ పూర్తయ్యింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు విదేశాల్లో మూడు పాటల చిత్రీకరిస్తాం. ఆ తర్వాత హైదరాబాద్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తాం. డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు.

ఇక దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ.. ‘‘పదేళ్ల తర్వాత గోపీచంద్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. గోపీచంద్, రెజీనా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే కోనవెంకట్, గోపీమోహన్ సంయుక్తంగా అందిస్తుండగా.. అనూప్ రూబెన్ పాటలు అందిస్తున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopichand soukyam movie  regina cassandra  as ravikumar  

Other Articles