Ravi Teja | Bengal Tiger | Audio Review | Audio Songs

Ravi teja bengal tiger audio review

Ravi Teja Bengal Tiger Movie Audio Review, Ravi Teja Bengal Tiger Audio Release, Bengal Tiger movie trailer, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Bengal Tiger Movie Shooting Updates, Bengal Tiger Movie Details, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Ravi Teja Bengal Tiger Audio Review: Raviteja latest film Bengal Tiger. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie release on 5 November.

మాస్ మసాలా రాకింగ్ ఆల్బం.. బెంగాల్ టైగర్ ఆడియో రివ్యూ..

Posted: 10/19/2015 01:09 PM IST
Ravi teja bengal tiger audio review

రవితేజ, తమన్నా, రాశిఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో తాజాగా విడుదలయ్యింది.

భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటలు సూపర్ గా వున్నాయి. ప్రతి పాట కూడా హిట్ అదరగొట్టే విధంగా వుంది. ‘బెంగాల్ టైగర్’ పాటలు ఎలా వున్నాయో ఒకసారి రివ్యూ చూద్దామా! ఇందులో మొత్తం 5 పాటలున్నాయి.

1. బెంగాల్ టైగర్... బెంగాల్ టైగర్...

ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. శంకర్ మహదేవన్ పాడారు. సింగర్ భార్గవి పిల్లై రాప్ పాడారు. కమర్షియల్ మాస్ బీట్ తో కొనసాగుతోంది. పాటలో సాహిత్యం కూడా బాగుంది. యువతను ఆకట్టుకునే విధంగా భీమ్స్ అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేసారు. మాస్ రాజా ఇంట్రడక్షన్ సాంగ్ గా రూపొందినట్లుగా కనిపిస్తోంది. ఇందులో ఐటెం సాంగ్స్ గోల్డెన్ లెగ్ భామ హంసా నందిని కూడా రవితేజతో ఆడిపాడింది. ఈ పాట పూర్తిగా కమర్షియల్ మాస్ సాంగ్ రూపొందింది. ప్రస్తుతం ఈ పాట హిట్ ట్రాక్ గా కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ పాట బిజియం చాలా బాగుంది.

2. ఆసియా.. 

ఈ పాటకు దర్శకులు సంపత్ నంది సాహిత్యాన్ని అందించారు. నాకష్ అజిజ్, నూతన పాడారు. ఈ పాట చాలా బాగుంది. ఇందులో రవితేజ, రాశిఖన్నాల డ్రెస్సింగ్ స్టైయిల్ బాగుంది. అలాగే లిరిక్స్ కూడా చాలా క్యాచీగా వున్నాయి. వినగానే మళ్లీ హమ్ చేసే విధంగా చాలా బాగున్నాయి. ఈ పాటను చిత్రీకరించిన లొకేషన్స్ బాగున్నాయి. ఫాస్ట్ బీట్ తో సాగే స్టైలిష్ లవ్ సాంగ్ లా కొనసాగుతోంది.

3. చూపులతో...

ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు. విజయ్ ప్రకాష్ పాడారు. పూర్తిస్థాయి రొమాంటిక్ సాంగ్ గా రూపొందింది. ఈపాటను అద్భుతంగా చిత్రీకరించారు. అందమైన సెట్స్ లో సాంగ్ ను షూట్ చేసారు. ఇందులో తమన్నా భారీగా అందాల ప్రదర్శన చేసింది. తన అందచందాలు ఈ పాటను మరింత గ్లామర్ గా మార్చాయి. తమన్నా తన హాట్ హాట్ అందాలను భారీగా చూపించేసింది. విజువల్స్ పరంగా ఈ పాట చాలా రొమాంటిక్ గా వుంది. వినడానికి మాత్రం చాలా స్మూత్ గా వినిపిస్తుంది.

4. బాంచన్...

ఈ పాటను భాస్కరభట్ల రచించారు. అద్నాన్ సమీ పాడారు. స్టైలిష్ మాసివ్ తరహాలో సాగే పాట ఇది. హీరోయిన్ అందాన్ని గురించి హీరో పాడే పాట ఇది. అలాగే తన ప్రేమను అర్థం చేసుకోమంటూ హీరోయిన్ వెంటపడుతూ పాడే పాటలా అనిపిస్తుంది. ఈ పాటను అద్నాన్ సమీ తనదైన శైలిలో అద్భుతంగా పాడారు.

5. రాయే రాయే...

సుద్దల అశోక్ తేజ రాసిన ఈ పాటను మమత శర్మ, ఉమ నేహ, సింహా పాడారు. పూర్తిస్థాయి మాస్ మసాలా సాంగ్ గా సాగుతోంది. ఇద్దరు భామలతో రవితేజ ఈ పాటలో మాస్ స్టెప్పులు వేసారు. ఈ పాటను చాలా కలర్ఫుల్ గా చిత్రీకరించారు. ఇందులో రాశిఖన్నా, తమన్నా హాట్ హాట్ అందాలు ఈ పాటకు మరింత గ్లామర్ ను తెచ్చిపెట్టనున్నాయి.

‘బెంగాల్ టైగర్’ ఆడియో మొత్తానికి మాస్ మసాలా రాకింగ్ ఆల్బంగా రూపొందింది. భీమ్స్ అద్భుతమైన పాటలను అందించారు. ప్రతి పాట కూడా వినసొంపుగా వున్నాయి. విజువల్స్ పరంగా అన్ని పాటలు కూడా థియేటర్లో మోత మోగించడం ఖాయమని చెప్పుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ravi Teja  Bengal Tiger  Audio Review  Audio Songs  Rashi khanna  Tamanna  

Other Articles