Rudhramadevi | Dil Raju | Offer | Guna shekhar

Dil raju open offer to director guna shekhar

Dil Raju Open Offer to Guna Shekhar, Rudhramadevi Success meet, Rudhramadevi movie news, Rudhramadevi movie updates, Rudhramadevi stills, Rudhramadevi movie details, Rudhramadevi latest news, Rudhramadevi collections, Rudhramadevi, Anushka, Allu Arjun

Dil Raju Open Offer to Director Guna Shekhar: Guna shekhar latest film Rudhramadevi. Anushka, Allu Arjun, Rana, Prakash Raj, Nithya menon acts in lead roles.

గుణశేఖర్ ప్రతాపరుద్రుడికి దిల్ రాజు ఓపెన్ ఆఫర్

Posted: 10/14/2015 11:25 AM IST
Dil raju open offer to director guna shekhar

గుణా టీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఇటీవలే అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో అనుష్క, అల్లు అర్జున్, ప్రకాష్ రాజ్, గుణశేఖర్, దిల్ రాజు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు గుణశేఖర్ కు నిర్మాత దిల్ రాజు ఓ భారీ ఆఫర్ ను ఇచ్చేసారు. అదేంటంటే....

ఈ సంధర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ... ఇలాంటి గొప్ప సినిమాలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లను అందరిని ముందుగా అభినందిస్తున్నాను. ‘అరుంధతి’, ‘మగధీర’ ఆ తర్వాత ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’.. చిత్రాలు తెలుగు సినిమాను గర్వపడే స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసినందుకు గర్వంగా వుంది. గుణశేఖర్ తపన వున్న దర్శకుల్లో ఒకరు. గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’ కథను రెడీ చేసుకుంటే నేను ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా వున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

‘రుద్రమదేవి’ చిత్రం తర్వాతీ భాగం ‘ప్రతాపరుద్రుడు’ అనే సినిమా చివర్లో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ‘రుద్రమదేవి’ చిత్రం ఎలాగో విడుదలై అన్నిచోట్ల మంచి టాక్ ను సొంతం చేసుకుంటోంది కాబట్టి.. ఇక గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’ కథను సిద్ధం చేసుకునే పనిలో పడతాడేమో చూడాలి. మరి భవిష్యత్తులో గుణశేఖర్ చెప్పే ‘ప్రతాపరుద్రుడు’ కథతో దిల్ రాజు సినిమాను నిర్మిస్తాడో లేక ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudhramadevi  Dil Raju  Offer  Guna shekhar  Allu Arjun  Anushka  stills  

Other Articles