Nikhil Shankarabharanam Movie Trailer Release Date

Nikhil shankarabharanam movie trailer release date

Shankarabharanam Movie Trailer Release Date, Shankarabharanam movie first look, Nikhil Shankarabharanam movie news, Nikhil Shankarabharanam movie updates, Nikhil Shankarabharanam stills, Nikhil Shankarabharanam posters, Nikhil Shankarabharanam first looks

Nikhil Shankarabharanam Movie Trailer Release Date: Actor nikhil latest film Shankarabharanam. This movie Motion Poster released. Uday Nandanavanam director.

రేపే శంకరాభరణం ట్రైలర్ విడుదల

Posted: 10/13/2015 04:24 PM IST
Nikhil shankarabharanam movie trailer release date

‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’. MVV సినిమా బ్యానర్ పై నిర్మాత ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే ఇందులోని ఓ పాటలో నిఖిల్ చేసిన డాన్స్ మూమెంట్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్ర ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రేపు విడుదల చేయనున్నట్లుగా తెలిసింది.

ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తున్నారు. కోనవెంకట్, పవన్ కళ్యాణ్ ల మధ్య మంచి స్నేహం వుండటం వలన ఈ ట్రైలర్ లాంచ్ ను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా చేయించాలని కోనవెంకట్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. అలాగే ఈ ట్రైలర్ ను ‘బ్రూస్ లీ’ చిత్రం ప్రదర్శించబడే థియేటర్లలో కూడా వేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

క్రైం కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో నిఖిల్ సరసన తొలిసారిగా నందిత హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Shankarabharanam  Trailer Release Date  First look  Stills  

Other Articles