Ramcharan | Brucelee the fighter | Pawan kalyan | Sardaar Gabbar Singh

Ramcharan meets pawan kalyan on the sets of sardaar gabbar singh

Ramcharan Meets Pawan Kalyan on the sets of Sardaar, Ramcharan Meets Pawan Kalyan, Ramcharan in Pawan Kalyan on the sets of Sardaar, Ramcharan in sets of Sardaar, Ramcharan movie news, Ramcharan movie updates, Ramcharan Brucelee the fighter release date, Ramcharan Brucelee the fighter trailers, Ramcharan, Brucelee the fighter, Pawan kalyan, Sardaar Gabbar Singh

Ramcharan Meets Pawan Kalyan on the sets of Sardaar Gabbar Singh: Megapower star Ram Charan Tej latest film Brucelee the fighter. This film will be release on 16 oct. Srinu vaitla direction. Rakul preet singh heroine. Power star pawan kalyan Sardaar Gabbar Singh.

సర్దార్ చెంతకీ బ్రూస్ లీ రావడానికి కారణం?

Posted: 10/12/2015 05:11 PM IST
Ramcharan meets pawan kalyan on the sets of sardaar gabbar singh

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో మళ్లీ చిరంజీవి ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా సెట్లో చెర్రీ కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవలే చరణ్ ఈ చిత్ర షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ను కలిసారు. అయితే ఈ విషయంపై టాలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ ను చరణ్ ఎందుకు కలిసారు అంటూ టాలీవుడ్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ నిర్మాతగా చరణ్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ విషయంపై పవన్ తో మాట్లాడటానికే చరణ్ కలిసాడని కొంతమంది భావిస్తున్నారు. ఇదిలా వుంటే బాబీ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడని, అందుకే ఈ సినిమా సెట్స్ కు వెళ్లాడని మరికొందరూ భావిస్తున్నారు.

కానీ తాజా సమాచారం ప్రకారం... పవనిజం సంధర్భంగా పవన్ కళ్యాణ్ ను కలవడానికి చరణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్స్ కు వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసాడని తెలిసింది. అసలు పవన్ ను కలవడానికి కూడా చరణ్ కు కారణం అవసరమా అంటూ మెగా, పవర్ స్టార్ అభిమానులు ఖండిస్తున్నారు.

ఏదేమైనా చరణ్, పవన్ ల మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేకపోవడంతో అభిమానులు కాస్త సంతోషంగా వున్నారు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘బ్రూస్ లీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramcharan  Brucelee the fighter  Pawan kalyan  Sardaar Gabbar Singh  Stills  

Other Articles