Sarathkumar | Vishal | Threat Calls | Nadigar Sangam Elections

Vishal seeks police protection for threat calls

Threat Calls Vishal seeks police protection, Sarathkumar files case against Vishal, Sarathkumar vs Vishal, Sarathkumar case files against Vishal, Vishal court issue, Vishal latest news, Vishal issues, Vishal case, Vishal defamation case, Sarathkumar

Vishal seeks police protection for Threat Calls: Nadigar Sangam President Sarathkumar has filed a defamation case against actor Vishal.

చంపేస్తామని విశాల్ కు బెదిరింపు కాల్స్

Posted: 10/12/2015 11:44 AM IST
Vishal seeks police protection for threat calls

నడిగర్ సంఘం ఎన్నికలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మొన్నటి వరకు మాటల యుద్ధమే నడిచింది. కానీ ఇపుడు ఏకంగా చంపేసుకోవడానికి కూడా సిద్ధమయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో శరత్ కుమార్, నాజర్(విశాల్) జట్ల మధ్య భారీ పోటీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఈనెల 18న జరుగనున్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

గతకొద్ది రోజులుగా ఈ ఇరు జట్లు కేవలం మాటల యుద్ధం చేసుకున్నాయి. అయితే ఈమధ్య విశాల్ కు కొన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. అంతేకాకుండా విశాల్ జట్టుకు సపోర్ట్ చేసే వారికి కూడా హెచ్చరికలు పెరుగుతున్నాయట. దీంతో విశాల్ మేనేజర్ మురుగరాజ్.. విశాల్ తరపున అన్నానగర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసారు.

విశాల్ కు కొన్ని తెలియని నంబర్ల నుంచి పదే పదే ఫోన్లు వస్తున్నాయని, ఫోన్లు చేసి తీవ్రంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. అంతే కాకుండా హత్య చేస్తామంటూ బయపెడుతుండటంతో విశాల్ కు మరియు ఆయన ఇళ్లు, కార్యాలయాలకు భద్రత కల్పించాలని విన్నవించారు.

విశాల్ కు బెదిరింపు కాల్స్ వస్తున్న ఆ ఫోన్ నెంబర్ల జాబితాను పోలీసులకు అందజేసారు. ప్రస్తుతం ఆ ఫోన్ నెంబర్లు ఎవరివో కనుక్కొని, వీటి వెనుక ఎవరూ వున్నారో విచారణ వేగవంతం చేసారు. విశాల్ ఇళ్లు, కార్యాలయాలకు భద్రత కల్పించారు. విశాల్ జట్టుకు సపోర్ట్ చేసే నాటక కళాకారులకు కూడా హెచ్చరికలు వస్తున్నాయట. దీంతో తమకు కూడా భద్రత కల్పించాలని వారు కూడా పోలీసులకు విన్నవిస్తున్నారు. మరి ఈ ఎన్నికల ఉద్రిక్తత ఇంకెలా మారనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarathkumar  Vishal  Threat Calls  Nadigar Sangam Elections  

Other Articles