Rudramadevi | Entertainment Tax | Exemption | Anushka | Allu Arjun | latest posters | Trailers

Rudramadevi to get entertainment tax exemption in telangana

Rudramadevi Movie to get Entertainment Tax Exemption in Telangana, Rudramadevi Movie Release on 9 October, Rudramadevi Hindi Official Theatrical Trailer, Rudramadevi Movie Hindi Rights Sold Out, Rudramadevi Movie Latest Poster, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Rudramadevi to get Entertainment Tax Exemption in Telangana: Thank you KCR garu for your support and encouragement! The film is being written and directed by Gunasekhar in 3D and features an ensemble cast of Anushka Shetty, Allu Arjun, Rana Daggubati, Vikramjeet Virk, Prakash Raj, Krishnam Raju, Nithya Menen, Baba Sehgal and Catherine Tresa, among others. Anushka Shetty plays the role of Rudrama Devi.The film's soundtrack and background score were composed by Ilaiyaraaja.The film is releasing at 9 October 2015.

రుద్రమదేవికి తెలంగాణ సిఎం బంపర్ ఆఫర్

Posted: 10/08/2015 04:19 PM IST
Rudramadevi to get entertainment tax exemption in telangana

ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని చివరకు అక్టోబర్ 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యింది ‘రుద్రమదేవి’. గుణశేఖర్ స్వీయదర్శకనిర్మాణంలో రూపొందింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో గుణశేఖర్ నిర్మించారు. ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్ల కష్టం వుంది. ఈ సినిమాను తీయడానికి ఎంత కష్టపడ్డారో.. ఈ సినిమాను విడుదల చేయడానికి అంతకంటే ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నారు చిత్ర యూనిట్.

అయితే ఈ కష్టాన్ని గుర్తించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంచి మనసుతో ఈ ‘రుద్రమదేవి’ సినిమాకు తెలంగాణలో టాక్స్ కట్టవలసిన అవసరం లేదని నిర్ణయించారు. కాకతీయుల చరిత్ర, రాణి రుద్రమదేవి జీవిత విశేషాలతో కూడిన కథాంశంతో నిర్మించిన 'రుద్రమదేవి' చిత్రానికి వినోద పన్ను మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే ఈ సినిమాకు వినోదపన్ను నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు తగిన ప్రోత్సాహం అందించాలనే ప్రభుత్వ విధాన నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Rudramadevi Movie to get Entertainment Tax Exemption in Telangana-02

రుద్రమదేవి చిత్ర దర్శకుడు గుణశేఖర్, ఆయన కుటుంబ సభ్యులు, ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. 'రుద్రమదేవి' సినిమాను చూడాల్సిందిగా ఆహ్వానించారు. దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రుద్రమదేవి గొప్పతనాన్ని చిత్రీకరించినందుకు దర్శకుడు గుణశేఖర్ ను ముఖ్యమంత్రి అభినందించారు. ఇలాంటి చిత్రాలు మరిన్ని నిర్మించాలని సూచించారు.

Rudramadevi Movie to get Entertainment Tax Exemption in Telangana-03

రాణి రుద్రమదేవిపై చిత్రాన్ని తీయడానికి తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పర్యటించానని, చరిత్రను అధ్యయనం చేసి తీశానని గుణశేఖర్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి స్పూర్తిగా నిలిచిన చెరువుల నిర్మాణం లాంటి అంశాలు కూడా చిత్రంలో ఉన్నాయన్నారు. తెలంగాణ చరిత్ర, ఇక్కడ రాజవంశీయుల గొప్పతనానికి సంబంధించిన అంశాన్ని ఎంచుకోవడం పట్ల ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఇలాంటి చిత్రాలను ప్రభుత్వం తప్పక ప్రోత్సహిస్తుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Entertainment Tax  Exemption  Anushka  Allu Arjun  latest posters  Trailers  

Other Articles