Ntr | Koratala shiva | launch date | Nannaku prematho | Rakul Preet singh | news

Koratala shiva ntr movie launch date confirmed

Ntr Koratala shiva movie launch date confirmed, Ntr Koratala shiva movie launch details, Ntr Koratala shiva movie details, Ntr Koratala shiva movie updates, Ntr Koratala shiva movie news, Ntr movie news, Ntr movie updates, Ntr stills, Ntr news, Ntr

Koratala shiva Ntr movie launch date confirmed: Star director Koratala Shiva Upcoming film with Young tiger NTR. Mytri movie makers producer. This movie will be launch on 25 oct.

ఎన్టీఆర్ కొరటాల శివల సినిమాకు ముహూర్తం ఫిక్స్

Posted: 10/08/2015 11:55 AM IST
Koratala shiva ntr movie launch date confirmed

‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకున్న కొరటాల శివ... ఇటీవలే మహేష్ తో ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని తెరకెక్కించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలు రెండూ కూడా భారీ ఘనవిజయం సాధించాయి.

దీంతో కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు సైతం సిద్ధమవుతున్నారు. అయితే కొరటాల శివ తన మూడవ చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించనున్నాడు. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

ఈ ప్రాజెక్టు అక్టోబర్ 25న ప్రారంభం కానుందని చిత్ర దర్శకనిర్మాతలు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు. మరికొద్ది రోజుల్లోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntr  Koratala shiva  launch date  Nannaku prematho  Rakul Preet singh  news  

Other Articles