Shah Rukh Khan | Tweets | Stills | Hot comments | News

Shah rukh khan hot comments on twitter fans

Shah Rukh Khan tweets, Shah Rukh Khan angry, Shah Rukh Khan latest tweets, Shah Rukh Khan hot comments, Shah Rukh Khan news, Shah Rukh Khan movie news, Shah Rukh Khan stills, Shah Rukh Khan

Shah Rukh Khan Hot Comments on twitter fans: Bollywood star hero Shah Rukh Khan angry fans in twitter. Shah Rukh Khan latest news, movies, gossips, stills, gallery.

పోకిరీలను హెచ్చరించిన బాలీవుడ్ బాద్షా

Posted: 10/05/2015 11:08 AM IST
Shah rukh khan hot comments on twitter fans

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన సోషల్ మీడియా ట్విట్టర్లో కొంతమందిపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. సోషల్ మీడియాలో హీరోలు, హీరోయిన్లు, మిత్రులు, సహుద్యోగులు... ఇలా ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా బాధపడేలా అసభ్యకరంగా పోస్టులు, కామెంట్లు చేస్తే.. అలాంటి వారు తన అభిమానులే కాదంటూ షారుక్ తన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసాడు.

గతంలో షారుక్, సల్మాన్ ల మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే మళ్లీ వీరిద్దరూ కలిసిపోయి, ఒకరికొకరూ బాగానే వున్నారు. ఒకరి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మరొకరు పాల్గొంటూ వారి స్నేహన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయం కొంతమంది ఫ్యాన్స్ కు నచ్చకపోవడంతో పరోక్షంగా అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై షారుక్ ఘాటుగా స్పందించాడు. ఇతర నటీనటుల సినిమాలపై అసభ్యకర, అనవసరపు కామెంట్లు చేయవద్దని, ఇలాంటి పోస్ట్ చేయడం మానుకోవాలని షారుక్ ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. సమాజంలో ఎలా వుండాలో తాను నేర్పడంలేదని, కాకపోతే కొంతమంది ఇడియట్స్ తో తాను వ్యంగ్యంగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు పూర్తి ఫ్రీడం ఇచ్చింది కాబట్టి... దీనిని ఇలా దుర్వినియోగం చేయవద్దని షారుక్ విజ్ఞప్తి చేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Tweets  Stills  Hot comments  News  

Other Articles