Jackie Chan | Ileana | KungFuYoga | Movie News | stills

Jackie chan to romance with ileana

Ileana Romance To Jackie Chan, Ileana latest news, Ileana hollywood news, Ileana movie news, Ileana movie updates, Ileana stills, Ileana hot details, Ileana, Jackie Chan

Jackie Chan to romance with Ileana: South actress Ileana Romance To Super star Jackie Chan. Jackie Chan to romance with Ileana D'Cruz in KungFuYoga movie.

ఇల్లి భామతో సూపర్ స్టార్ రొమాన్స్?

Posted: 10/05/2015 10:59 AM IST
Jackie chan to romance with ileana

సినిమాల్లో హీరోయిన్లుగా రాణించాలని ప్రతి లేడి మోడల్ అనుకుంటూ వుంటారు. ఒకవేళ సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం వస్తే.. మరో ఇండస్ట్రీలో కూడా తన ప్రతిభ చూపించాలని తహతహాలాడుతుంటారు. ఇక ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారితే మాత్రం రెమ్యునరేషన్ తో పాటుగా అన్ని పెంచేస్తూ వుంటారు.

అయితే ఈ విషయం కాస్త పక్కన పెడితే... టాలీవుడ్ లో మొన్నటివరకు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఇలియానా.. తెలుగులో సరైన అవకాశాలు రావట్లేదని బాలీవుడ్ కు చెక్కేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడికి బాలీవుడ్ లో కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయి. అయితే తాజాగా ఈ అమ్మడికి సూపర్ స్టార్ జాకీచాన్ సినిమాలో ఆఫర్ వచ్చినట్లుగా తెలిసింది.

ప్రస్తుతం జాకీచాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుంగ్ పూ యోగ’. ఈ చిత్రానికి స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సోనూసూద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో జాకీచాన్, సోనూసూద్ లపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఇందులో జాకీచాన్ సరసన హీరోయిన్ గా ఇలియానాను ఎంపిక చేసినట్లుగా తెలిసింది.

గతంలో జాకీచాన్ నటించిన ‘ది మిత్’ చిత్రంలో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ మల్లికా శెరావత్ హీరోయిన్ గా జతకట్టింది. ఒకవేళ ఇపుడు ఇలియానాకు వచ్చిన ఆఫర్ నిజమైతే... మల్లికా శెరావత్ తర్వాత జాకీచాన్ తో నటించిన రెండవ ఇండియన్ భామగా ఇలియానాకే ఆ క్రెడిట్ దక్కుతుంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం వుందో త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jackie Chan  Ileana  KungFuYoga  Movie News  stills  

Other Articles