Finally Megastar Chiranjeevi Joins Bruce Lee Movie Shooting On Monday | Ram Charan | Rakul Preet Singh | Director Srinu Vaitla

Chiranjeevi joins bruce lee movie shooting on monday

megastar chiranjeevi, chiranjeevi news, chiranjeevi updates, chiranjeevi movie news, chiranjeevi bruce lee news, chiranjeevi bruce lee shooting, chiranjeevi bruce lee movie part, ram charan bruce lee movie, rakul preet singh, director srinu vaitla

Chiranjeevi Joins Bruce Lee Movie Shooting On Monday : Finally Megastar Chiranjeevi Joins Bruce Lee Movie Shooting On Monday.

‘బ్రూస్ లీ’లో చిరు సందడి మొదలైంది.. కానీ!

Posted: 09/28/2015 07:01 PM IST
Chiranjeevi joins bruce lee movie shooting on monday

మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. గత ఏడేళ్లుగా మేకప్ వేసుకోకుండా ఇతర కార్యకలాపాల్లో బిజీగా గడిపిన మెగాస్టార్ చిరంజీవి.. ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చేశారు. ఆయన ఫుల్ లెంగ్త్ 150వ చిత్రానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేలా వుంది కాబట్టి.. తన అభిమానులను అలరించేందుకు ఆయన ‘బ్రూస్ లీ’లో ప్రత్యేక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మిగతా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. సోమవారం నుంచి చిరుపై షూట్ చేయాల్సిన పార్ట్ షూటింగ్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టాశారు. మూడు రోజులపాటు కంటిన్యూగా చిరుపై ఓ ఫైట్, కొన్ని సీన్స్ షూట్ చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో చిరుపై ఓ స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించనున్నారని గతంలో వార్తలొచ్చాయి కానీ.. ఇప్పుడా పాట లేనట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా.. చాలాకాలం తర్వాత చిరు మేకప్ వేసుకుని కెమెరా ముందుకు రావడంతో మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకొక విషయం ఏమిటంటే.. చిరు ఎంతసేపు సినిమాలు కనిపిస్తారనే విషయంపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొని వుంది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. ‘బ్రూస్ లీ’ సినిమాలో చిరు కనిపించేది కేవలం మూడు నిముషాలు మాత్రమేనని తెలుస్తోంది. ఈ మూడు నిముషాల నిడివిలోనే ఆయనపై ఓ ఫైట్ తోపాటు కొన్ని సీన్స్ ని చిత్రీకరిస్తున్నారట. కానీ.. గతంలో ఆయన దాదాపు 15 నిముషాల పాటు స్ర్కీన్ పై సందడి చేసే అవకాశముందని వార్తలొచ్చాయి కానీ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి. చిరు కేవలం 3 నిముషాలు మాత్రమే సినిమాలో కనిపిస్తాడని.. అదే సినిమాకి హైలైట్ కానుందని అంటున్నారు. ఈ విషయం అభిమానులు కాస్త నిరాశే కలిగించినప్పటికీ.. చిరు పార్ట్ మాత్రం అభిమానుల్ని పండగలా అనిపించేలా వుంటుందని అంటున్నారు. పైగా.. దర్శకుడు శ్రీనువైట్ల కూడా చిరు పార్ట్ ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నాడని, ఆయన ఎపిసోడ్ ని అద్భుతంగా వుండేలా తయారు చేస్తున్నాడని సమాచారం. ఇక ఈయన పార్ట్ తో పాటు మిగిలి వున్న మిగతా షూటింగ్ పార్ట్ ని కూడా అక్టోబర్ మొదటి వారంకల్లా పూర్తవుతుందని చిత్ర బృందం తెలుపుతోంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే! దసరా కానుకగా ఈ సినిమాని అక్టోబర్ 16న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తమన్ అందించిన మ్యూజికల్ ఆల్బమ్ ని అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో చిరు నటించనున్న కారణంగా ఈ మూవీ క్రేజ్ టాలీవుడ్ లో మరింత పెరుగుతూ వస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : megastar chiranjeevi  bruce lee movie updates  ram charan  

Other Articles