Tamanna Bhatia Talks About Her Success Plans | Film Industry | Telugu Actresses

Tamanna bhatia reveals her success film industry

tamanna news, tamanna updates, tamanna bhatia news, tamanna bhatia controversy, tamanna bhatia gallery, tamanna bhatia press meet, tamanna, telugu actresses, telugu heroines, tollywood success mantra

Tamanna Bhatia Reveals Her Success Film Industry : Tamanna Bhatia Talks About Her Success Plans.

సక్సెస్ కోసం తమన్నా ఏం చేసిందో తెలుసా?

Posted: 09/26/2015 11:26 AM IST
Tamanna bhatia reveals her success film industry

సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రతిఒక్కరికి తీవ్రంగా శ్రమించాల్సి వుంటుంది. చిన్నస్థాయిలో వున్న నటులైనా సరే.. స్టార్ హోదాలో వున్న హీరోలైనా సరే! అప్పుడే సక్సెస్ వారిని వరిస్తుంది. లేకపోతే ఆదిలోని కెరియర్ ముగిసిపోతుంది. ఈ విషయాన్ని గ్రహించిన చాలామంది నటీనటులు.. సక్సెస్ కోసం రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మరి.. తమన్నా ఏం చేసిందో తెలుసుకుందామా..?

‘ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త కథానాయికల హవా జోరుగా సాగుతోంది. సీనియర్ హీరోయిన్లను వెనక్కు నెడుతూ తమ సత్తా చాటుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో సక్సెస్ కోసం మీరు పాటించే పద్ధతులు ఏంటి?’ అని తమన్నాను ప్రశ్నంచగా.. తనదైన రీతిలో సమాధానం చెప్పింది. ‘చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఒక రకమైన కష్టమైతే.. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం మరింత కష్టం. ఒక సినిమా హిట్ అయితే పది సినిమాలు వస్తాయి.. అలా అని వాటిని ఒప్పేసుకుంటూపోతే.. ఆ తర్వాత ఆ స్థాయిలో ఛాన్సులు రాకపోవచ్చు. అందుకే.. సినిమాల ఎంపికలోనూ, పాత్రల విషయంలోనూ ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుండాలి. నేను అలాగే ఫాలో అవుతాను’ అని తమన్నా పేర్కొంది.

నటనకి అవకాశం కలిగిన పాత్రలు చేస్తేనే ఇండస్ట్రీలో పోటీని తట్టుకునేలా చేస్తాయనీ, కెరియర్ ను నిలబెడుతాయని తమన్నా చెబుతోంది. అలా తాను కెరియర్ ప్రారంభంలో ఎంచుకున్న ‘హ్యాపీ డేస్’ చిత్రం తనకు గుర్తింపు నిచ్చిందని.. ఇప్పుడు ‘బాహుబలి’ తన స్థానాన్ని మరింత పదిలం చేసిందని ఆమె అంటోంది. ప్రస్తుతం ఈమె రవితేజ సరసన ‘బెంగాల్ టైగర్’ సినిమా నటిస్తోంది. మరిన్ని కథలు వింటున్నట్లు సమాచారం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna Bhatia  Telugu Heroines  Young Actresses  

Other Articles