Mass Director Puri Jagannadh To Introduce Former CM Kumara Swamy Son Nikhil Gowda As Hero In Sandalwood | Movie Gossips

Puri jagannadh to introduce former cm kumara swamy son nikhil gowda as hero

puri jagannadh, nikhil gowda, former cm kumara swamy gowda, sandalwood, telugu film industry, puri jagannadh movies, nikhil gowda updates, kumara swamy son nikhil gowda, daggubati rana, leader movie, leader telugu movie, nikhil gowda leader movie updates

Puri Jagannadh To Introduce Former CM Kumara Swamy Son Nikhil Gowda As Hero : Mass Director Puri Jagannadh To Introduce Former CM Kumara Swamy Son Nikhil Gowda As Hero In Sandalwood.

మాజీ సీఎం కొడుకుతో పూరీ ఒప్పందం!

Posted: 09/26/2015 12:00 PM IST
Puri jagannadh to introduce former cm kumara swamy son nikhil gowda as hero

తెలుగు చిత్రపరిశ్రమలో పేరుగాంచిన స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. ఇంట్రెస్టింగ్ స్టోరీలతో కూడిన సినిమాలను జెడ్ స్పీడులో తెరకెక్కించే పూరీ.. హీరోయిజాన్ని సరికొత్త యాంగిల్ లో ప్రజెంట్ చేయడంలో ఈయనకు ఈయనే సాటి. అంతేకాదు.. సినిమాను పబ్లిసిటీ చేయడంలోనూ, దాని హైప్ క్రియేట్ చేయడంలోనూ పూరీ దిట్ట. అందుకే.. స్టార్ వారసులను ఇంట్రడ్యూస్ చేయడానికి పూరీనే బెస్ట్ ఛాయిస్గా ఫీల్ అవుతారు. ఇప్పటికే మెగా వారసుడు రామ్ చరణ్తో పాటు, శాండల్వుడ్ స్టార్హీరో రాజ్కుమార్ తనయుడు పునీత్ రాజ్కుమార్ను పరిచయం చేసిన పూరీ.. ఇప్పుడు మరో క్రేజీ హీరోను పరిచయం చేస్తున్నాడు. అయితే ఈసారి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారసుడ్ని కాకుండా ఓ రాజకీయ నాయకుడి కొడుకును హీరోగా పరిచయం చేయబోతున్నాడు.

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను పూరీ జగన్నాథ్ వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. నిజానికి.. రానా హీరోగా నటించిన ‘లీడర్’ సినిమా రీమేక్ తోనే నిఖిల్ గౌడ హీరోగా పరిచయం కావాల్సి వుండేది. కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టును వాయిదా వేయాల్సి వచ్చింది. తదనంతరం తీయాలని అనుకున్నా.. అప్పట్లో కుదరలేదు. దీంతో నిఖిల్ తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో కూడిన ఆ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం కంటే.. మాస్ హీరోగా ఎంట్రీ ఇద్దామని భావించాడు. ఈ నేపథ్యంలోనే తనను సూపర్ గా ఎలివేట్ చేసే డైరెక్టర్ వేటలో పడ్డ నిఖిల్.. పూరీ జగన్నాథ్ బెస్ట్ ఆప్షన్ అని భావించి అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడని సమాచారం. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో నిఖిల్ సినిమాకు రెడీ అవుతున్నాడని తెలిసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం వరణ్తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘లోఫర్’ షూటింగ్లో పూరీ జగన్నాథ్ బిజీగా వున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత నిఖిల్ గౌడ లాంచింగ్ సినిమా పని మొదలుపెట్టనున్నాడు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : puri jaganndh  nikhil gowda  former cm kumara swamy  sandalwood  

Other Articles