Young Actress Regina Cassandra Become More Busy With Regular Movie Shootings | Tollywood Updates

Regina cassandra full busy with more offers tollywood news

Regina Cassandra news, Regina Cassandra updates, Regina Cassandra photos, Regina Cassandra gallery, Regina Cassandra hot photo shoot, Regina Cassandra photo shoot, Regina Cassandra gopichand, Regina Cassandra subramanyam for sale, Regina Cassandra manchu manoj, Regina Cassandra shourya movie, Regina Cassandra with nara rohith

Regina Cassandra Full Busy With More Offers Tollywood News : Young Actress Regina Cassandra Become More Busy With Regular Movie Shootings.

అప్పుడు తడబడింది.. ఇప్పుడు ట్రాక్ ఎక్కేసింది!

Posted: 09/24/2015 06:49 PM IST
Regina cassandra full busy with more offers tollywood news

‘లక్ష్యసాధనవైపు సమయస్ఫూర్తిగా ముందడుగు వేస్తే.. ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయం కచ్చితంగా వరిస్తుంది’ అన్న మాటను నటి రెజీనా నిరూపించిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. నిన్నటిదాకా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ కాలక్షేపం చేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ బిజీగా వుంది. ‘కొత్త జంట’ సినిమా నుంచి ఈ అమ్మాయి కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ చిత్రానికి ముందు తన కెరీర్ ని మలుచుకోవడంలో రెజీనా తడబడింది.. కానీ ఆ మూవీ తర్వాత సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కేసింది. ఇంతలోనే ఆమెకు ‘పిల్లా నువ్వులేని జీవితం’లో నటించే అవకాశం రావడం, ఆ సినిమా భారీ విజయం కావడంతో.. ఈ అమ్మడు మరింత ఉత్సాహంగా దూసుకుపోతోంది.

ఆ సినిమా అదృష్టమా అంటూ రెజీనాకు వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా గురువారం (24-09-2015) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో మరింత గ్లామర్ గా కనిపించిన రెజీనా.. కథానాయికగానూ మంచి మార్కులు కొట్టేసింది. త్వరలోనే మాచో మేన్ గోపీచంద్ జోడీగాను ఈ భామ అలరించనుంది. తాజాగా మంచు మనోజ్ సినిమా ‘శౌర్య’లోను ఈమె కథానాయికగా ఎంపిక అయ్యింది. అటు నారారోహిత్ సరసన ‘శంకర’లోనూ ఈమె ఛాన్స్ పొందిన విషయం తెలిసిందే! అంతేకాదు.. కొందరు దర్శకనిర్మాతలు ఈమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా.. యువ కథానాయకులతో సినిమాలను ప్లాన్ చేసుకుంటున్న దర్శకనిర్మాతలు.. తమ ప్రాజెక్టుల్లో కథానాయికగా రెజీనాకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారట. గ్లామర్ తోపాటు అభినయంతో మెప్పిస్తున్న కారణంగా ఈమెవైపే దర్శకనిర్మాతలు దృష్టి సారించారని తెలుస్తోంది.

నిన్నటిదాకా సినిమాల కోసం వెయిట్ చేసిన రెజీనాకు వరుసగా ఆఫర్లు వస్తుండటంతో చాలా ఆనందంలో వుందని హర్షం వ్యక్తం చేస్తోంది. ఓవైపు సినిమా షూటింగుల్లో బిజీగా వుంటూనే.. మరోవైపు కథలు వింటూ ఫుల్ అయిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈమె హవా జోరుగా సాగుతోందని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina Cassandra  Tollywood Updates  Telugu Movies  

Other Articles