Niharika Is Ready To Give Entry On Silver Screen With Nagashourya | TV9 News Channel | Madhura Sridhar

Niharika tollywood entry nagashourya love film tv9 news channel madhura sridhar

niharika news, niharika photos, niharika photo shoot, niharika gallery, nagababu daughter niharika photos, naga shourya, naga shourya movies, niharika with naga shourya

Niharika Tollywood Entry Nagashourya Love Film TV9 News Channel Madhura Sridhar : Niharika Is Ready To Give Entry On Silver Screen With Nagashourya.

నాగశౌర్యతో మెగాభామ నిహారిక ప్రేమాయణం

Posted: 09/24/2015 04:00 PM IST
Niharika tollywood entry nagashourya love film tv9 news channel madhura sridhar

ఇండస్ట్రీలో యంగ్ లవర్ బాయ్ గా పేరొందిన నాగశౌర్య, మెగాభామ నిహారికల మధ్య ప్రేమ చిగురుతోందని సమాచారం. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా వున్నా.. నమ్మక తప్పదు. అయితే.. ఇది రియల్ లైఫ్ లో కాదులెండి.. రీల్ లైఫ్ లో మాత్రమే! ఇన్నాళ్లూ పలు టీవీ షోల్లో వ్యాఖ్యాతగా బుల్లితెరపై మెరిసిన నిహారిక.. ఇప్పుడు హీరోయిన్ గా వెండితెరపై కనువిందు చేయనుంది.

మెగాఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు వచ్చారు కానీ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన దాఖలాలు లేవు. నాగబాబు కూతురు నిహారిక కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుందని ఆమధ్య వార్తలొచ్చాయి. కానీ.. మెగాకుటుంబం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు ఆమె ఎంట్రీకి మెగాఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలోనే ఆమె ఓ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే పలు టీవీ షోల్లో వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక, ప్రముఖ న్యూస్ చానల్ టీవీ 9 సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతూ నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు. ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ వంటి అందమైన ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వరుస హిట్స్‌తో లవర్ బాయ్ గా పాపులర్ అయిన నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను టీవీ9 సంస్థతో కలిసి మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Niharika News  Naga Shourya Movies  

Other Articles