Director Srinu Vaitla Creates Suspence On Chiranjeevi First Look In Bruce Lee Movie | Tollywood News

Chiranjeevi first look suspence bruce lee the fighter movie srinu vaitla updates

chiranjeevi news, chiru first look news, chiranjeevi updates, chiranjeevi hot gossips, chiru 150 movie, chiru in bruce lee movie, chiranjeevi in bruce lee movie, chiranjeevi bruce lee first look, srinu vaitla news, ram charan updates, rakul preet singh, tollywood news

Chiranjeevi First Look Suspence Bruce Lee The Fighter Movie Srinu Vaitla Updates : Director Srinu Vaitla Creates Suspence On Chiranjeevi First Look In Bruce Lee The Fighter Movie.

చిరు ఫస్ట్-లుక్ పై సస్పెన్స్ క్రియేట్ చేసిన డైరెక్టర్

Posted: 09/24/2015 11:29 AM IST
Chiranjeevi first look suspence bruce lee the fighter movie srinu vaitla updates

మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు దర్శకుడు శ్రీనువైట్ల ఒకింత సస్సెన్స్ లో పెట్టేశాడు. నిన్నటివరకు ఓ గుడ్ న్యూస్ తో చిరు ఫ్యాన్స్ ని సంతోషపెట్టిన ఆయన.. ఇప్పుడు మరో షాకింగ్ వార్తతో వారిని కాస్త నిరాశకు గురిచేశాడు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రూస్‌లీ’ పేరుతో ఓ భారీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చాలా ప్రత్యేకతలతోనే తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి ఓ గెస్ట్ రోల్ చేయడంతో మరింత సెన్సేషన్‌గా మారిపోయింది. చిరు 150వ చిత్రం వాయిదా పడుతూ వస్తుండటంతో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ.. ఇంతలోనే దర్శకుడు శ్రీనువైట్ల తమ సినిమాలో చిరు ఓ ప్రత్యేకమైన రోల్ లో నటించనున్నాడని గుడ్ న్యూస్ తెలపడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. దీంతో ఈ సినిమా క్రేజ్ మరింత పెరిగింది.

‘బ్రూస్ లీ’ సినిమాలో చిరు నటించే 15 నిముషాల పాత్ర ఏమిటి? అందులో ఆయన ఎలా కనిపించబోతున్నారు? అనే ఆతృత ఫ్యాన్స్ లో ఎక్కువవుతూ వచ్చింది. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఓ సాంగ్, చిత్రీకరణకు సంబంధించిన కొన్ని స్టిల్ విడులవడంతో.. త్వరలోనే చిరుకి సంబంధించి ఫస్ట్ లుక్ చేయవచ్చునని భావించారు. కానీ.. ఈ విషయంపై శ్రీనువైట్ల బాంబు పేల్చేశాడు. లుక్ చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ ఎదురుచూడాలనే సంకేతాలిస్తున్నారు. సినిమాలో ఆయన పాత్రేంటి? ఎలా కనిపించబోతున్నారు? అనే విషయాలు తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదని చెప్పినట్లు సమాచారం.

చిరంజీవి-రామ్ చరణ్ కాంబోను డైరెక్ట్ చేయడాన్ని తన అదృష్టంగా తెలిపిన శ్రీనువైట్ల, చిరు పార్ట్ సినిమాకు సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌గా నిలుస్తుందని తెలిపారు. అందుకే.. రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందేనని ఆయన చెప్పినట్లు యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అక్టోబర్ 2న ఈ సినిమా ఆడియోను విడుదల కానుండగా, అక్టోబర్ 16న సినిమా విడుదల కానుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles