Anushka Shetty To Do An Item Song With Allu Arjun In Sarainodu Movie | Director Boyapati Srinu | Tollywood News

Anushka shetty item song allu arjun sarainodu movie boyapati srinu tollywood news

anushka shetty news, anushka item songs, anushka movies, anushka shetty hot photo shoot, anushka hot gallery, anushka photo gallery, anushka updates, allu arjun movies, allu arjun news, allu arjun sarainodu movie, sarainodu movie updates, boyapati srinu

Anushka Shetty Item Song Allu Arjun Sarainodu Movie Boyapati Srinu Tollywood News : According To The Tollywood Sources Anushka To Do An Item Song In Sarainodu Movie With Allu Arjun.

‘సరైనోడు’ కోసం ఐటెంగర్ల్ గా మారిన స్వీటీ

Posted: 09/24/2015 10:44 AM IST
Anushka shetty item song allu arjun sarainodu movie boyapati srinu tollywood news

మూడుపదుల వయస్సు దాటినా ఇంకా తగ్గని అందంతో అనుష్క ప్రేక్షకుల్ని మైమరిపిస్తోంది. ఓవైపు నటిగా మంచి గుర్తింపునిచ్చే పాత్రల్లో నటిస్తూనే.. గ్లామర్ కథానాయికగా కొనసాగుతోంది. నిజానికి ఇండస్ట్రీలో ఎంతోమంది యువతారలు వున్నప్పటికీ.. ఈ స్వీటీ వారిని మరిపించేలా తన గ్లామర్ తో, నటనతో ఆకట్టుకుంటోంది. అందుకే.. ఈ అమ్మడికి ఇప్పటికీ అవకాశాలు వరిస్తూనే వున్నాయి. ఈమె నటించిన ‘రుద్రమదేవి’ సోషియో ఫాంటసీ చిత్రం విడుదలకు సిద్ధంగా వుండగా.. ‘సైజ్ జీరో’ చిత్రం షూటింగులో ఫుల్ బిజీగా వుంది. ఇంకా తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్న ఈ అమ్మడికి.. ‘సరైనోడు’ చిత్రంలో ఐటం సాంగులో నటించే ఆఫర్ వచ్చిందని సమాచారం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ‘సరైనోడు’ చిత్రం రూపొందుతోంది. గతకొన్నాళ్ల నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో త్వరలోనే ఐటమ్ సాంగ్ కు సంబంధించిన చిత్రీకరణను ప్రారంభించనున్నారు. సినిమాకే హైలైట్ గా నిలవనున్న ఈ ఐటెంసాంగ్ కోసం మంచి గుర్తింపు వున్న కథానాయికను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న తారలను పరిశీలించారు. ఇంతలో.. ప్రియమణి ఆ ఐటెం సాంగులో నటిస్తుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. ప్రస్తుతం ఆమె క్రేజ్ ఇండస్ట్రీలో అంతగా లేదు కాబట్టి.. ఆమె స్థానంలో అనుష్కను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూనిట్ ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. ఇందుకోసం ఆమెను భారీ పారితోషికం ఇవ్వడానికి కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు. మరి.. స్వీటీ ఈ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాల్సిందే!

ఇదిలావుండగా.. ఈ చిత్రంలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే! ఆమెతోపాటు అనుష్క గ్లామర్ కూడా ఈ సినిమాకు తోడైతే.. ప్రేక్షకులకు కనువిందుగా వుంటుందని, దాంతో తమ సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun Sarainodu  Anushka Shetty Item Songs  Director Boyapati Srinu  

Other Articles