Tamanna Bhatia Has Given Clarity That She Is Not Doing Item Song In Bruce Lee Movie | Tollywood News

Tamanna bhatia clarity on item song in bruce lee movie

tamanna bhatia news, tamanna hot news, tamanna hot photos, tamanna latest updates, tamanna item songs, tamanna photoshoot, bruce lee movie, chiranjeevi updates, chiranjeevi gossips, ram charan with chiranjeevi, director srinu vaitla

Tamanna Bhatia Clarity On Item Song In Bruce Lee Movie : Tamanna Bhatia Has Given Clarity That She Is Not Doing Item Song In Bruce Lee Movie. She Said Nobody Came To Her To Do That Song.

ఆ పుకార్లను నమ్మొద్దు.. ప్లీజ్!

Posted: 09/19/2015 01:20 PM IST
Tamanna bhatia clarity on item song in bruce lee movie

మిల్కీబ్యూటీ తమన్నాకు సంబంధించి ఓ ఘాటు పుకారు తెలుగు ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేనండి.. రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ’లో ఈమె ఓ స్పెషల్ సాంగ్ లో నటించనుందని ఈమధ్య వార్తలొచ్చిన విషయం తెలిసిందే! అది కూడా మెగాస్టార్ చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం అమ్మడికి వచ్చిందని టాక్ వినిపించింది. ముందుగా ఈ స్పెషల్ సాంగ్ లో ఇలియానా డ్యాన్స్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అనంతరం తమన్నా పేరు వినిపించింది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదంటూ తమన్నా తాజాగా కొట్టిపారేసింది.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రూస్‌లీ’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్ల నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరు కూడా ఓ గెస్ట్ రోల్ లో నటించనున్నారు. అంతేకాదు.. ఓ స్పెషల్ సాంగ్ లోనూ ఈయన డ్యాన్స్ చేయనున్నారు. ఈ పాటతో ఆడియెన్స్ ను మరింత రక్తి కట్టించేందుకు చిరుతోపాటు మరో స్టార్ హీరోయిన్ ను కూడా తీసుకోవాలని యూనిట్ భావించింది. ఈ నేపథ్యంలోనే మొదట ఇలియానా పేరు వినిపించింది. అయితే.. ఇంతలోనే ఏమయ్యిందో తెలీదు కానీ.. తర్వాత తమన్నా పేరు తెరమీదకొచ్చింది. దాదాపు ఆమె ఖరారైనట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే.. తాను బ్రూస్ లీలో స్పెషల్ సాంగ్ చేయడం లేదంటూ ఆమె క్లారిటీ ఇచ్చేసింది. బ్రూస్‌లీ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని, ఇది తప్పుడు సమాచారమని ఆమె పేర్కొంది. దీంతో ఆ స్పెషల్ సాంగ్ లో చిరుతో ఎవరు నృత్యించనున్నారోనన్న విషయమై ఆసక్తి నెలకొంది.

ఇదిలావుండగా.. ‘బ్రూస్ లీ’ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్స్‌తో అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ సినిమాల్లాగే ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తుననారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ నెల్లోనే ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bhatia  bruce lee telugu movie  chiranjeevi ram charan  

Other Articles