Rajamouli Talks About Bahubali Movie That There Is Not Continues After Second Part | Tollywood News

Rajamouli talks about bahubali movie

rajamouli news, rajamouli bahubali, bahubali updates, bahubali gossips, bahubali second part, bahubali gossips, bahubali rumours, rajamouli press meet

Rajamouli Talks About Bahubali Movie : Rajamouli Talks About Bahubali Movie That There Is Not Continues After Second Part

రాజమౌళి నోట ‘బాహుబలి’ శుభం మాట!

Posted: 09/19/2015 01:09 PM IST
Rajamouli talks about bahubali movie

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇండియన్ బాక్సాఫీస్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. అంతేకాదు.. ఇటీవల లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రదర్శించబడిన ‘బాహుబలి’ చిత్రం సినీ ప్రముఖులతో ప్రశంసలు అందుకుంది. ఇలా ఎన్నో రికార్డులను సాధించిన ఈ చిత్రంతో దర్శకుడిగా రాజమౌళి కూడా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో లాస్ ఏంజిల్స్ లో ‘డైరెక్టర్స్ పానెల్’తో ఏ.ఎమ్.డి. సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జక్కన్న హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన ‘బాహుబలి’కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.

నిజానికి ‘బాహుబలి’ సినిమా విషయంలో కొన్ని ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. ‘బాహుబలి’ సినిమా ఏ విధంగా సగం కథ వుండగానే ముగిసిపోయిందో.. అదేవిధంగా ‘బాహుబలి 2’ కథ ముగుస్తుందా..? ఆ సినిమాకు కొనసాగింపు వుంటుందా? అనే ప్రశ్నలు వెలుగులోకి వచ్చాయి. ఒకవేళ ‘బాహుబలి 2’ చిత్రం ముగిసిపోతే.. దానికి కొనసాగింపుగా మరో కథను తెరమీదకి తీసుకొస్తారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ ప్రశ్నల్ని గతంలో చాలాసార్లు రాజమౌళికి వినిపించినప్పటికీ.. ఆయన అందుకు సమాధానాలు ఇవ్వకుండా సైలెంట్ గానే వుండిపోయారు. కానీ.. లాస్ ఏంజిల్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన పై ప్రశ్నలన్నింటికి సమాధానాలు తెలియజేశారు. ‘బాహుబలి 2’తో కథ ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘నేను సిద్ధం చేసుకున్న కథ ప్రకారం ‘బాహుబలి’ సినిమా రెండో భాగంతో ముగుస్తుంది. దానికి కొనసాగింపుగా ఏ కథ సిద్ధం చేసుకోలేదు.. ఉండదు కూడా!’ అని తెలిపారు. దీంతో ‘బాహుబలి’ సిరీస్ కొనసాగింపు వుండవచ్చుననే సందేహాలకు తెరపడినట్లే అయ్యింది. అయితే.. ‘బాహుబలి2’ షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందో.. సినిమా రిలీజ్ ఎప్పుడోనన్న విషయాల్ని వెల్లడించలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli news  bahubali updates  

Other Articles