Ram Charan | BruceLee | Pawan Kalyan | Thaman | Voice Over | Rakul preet singh | Trailer

Ss thaman composing special song for chiranjeevi brucelee film

Thaman Composing Special Song for Chiranjeevi, Pawan Kalyan Voice Over to BruceLee Movie, Ram Charan BruceLee Movie Introduction Song, Ram Charan BruceLee Movie Release Date, Ram Charan BruceLee First Look Official Teaser, Ram Charan BruceLee Stills, Ram Charan BruceLee Movie Shooting in hyderabad, Ram Charan upcoming film BruceLee, Ram Charan BruceLee movie news, Ram Charan BruceLee movie updates, Ram Charan BruceLee film news, Ram Charan BruceLee movie stills, Ram Charan latest news, Ram Charan latest updates, Ram Charan

SS Thaman Composing Special Song for Chiranjeevi BruceLee Film: Mega power star Ram Charan Tej Upcoming film BruceLee The Fighter. Rakul Preet singh heroine. Chiranjeevi acts in special guest role. directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman. Movie will be release on 16 Oct.

‘బ్రూస్ లీ’ మెగాస్టార్ కోసం థమన్ స్పెషల్ దరువు

Posted: 09/10/2015 02:07 PM IST
Ss thaman composing special song for chiranjeevi brucelee film

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రూస్ లీ’ చిత్రంపై రోజురోజుకి అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అంతేకాకుండా రోజురోజుకి ఈ సినిమా గురించి కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ‘ది ఫైటర్’ అనేది ట్యాగ్ లైన్.

ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో దాదాపు 15 నిమిషాల వరకు చిరంజీవి పాత్ర వుండనుందని తెలిసింది. అలాగే ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించనున్నాడని తెలిసింది. అయితే తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ స్టెప్పులు కూడా వేయనున్నాడని తెలిసింది.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మెగాస్టార్ కోసం ఈ సినిమాలో ఓ పాటను కంపోజ్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా థమన్ తన ట్విట్టర్ ద్వారా ... మొట్ట మొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి గారి కోసం ఓ సాంగ్ కంపోజ్ చేయబోతున్నాను. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మీ అందరి ఆశీర్వాదం కావాలంటూ ట్వీట్ చేసాడు.

దీంతో మెగా అభిమానులు చాలా సంతోషంగా వున్నారు. ఇందులో చిరంజీవి కేవలం స్పెషల్ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించనున్నాడని అనుకుంటే.. ఇలా స్పెషల్ సాంగ్ లో కూడా నటించనున్నాడని తెలిసి, అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ చిత్ర ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కథను కోన వెంకట్, గోపి మోహన్ లు అందిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee  Pawan Kalyan  Thaman  Voice Over  Rakul preet singh  Trailer  

Other Articles