Bahubali Movie In Oscar Race | Bhusan Film Festival | Bollywood Movies | PK

Bahubali movie oscar race bhusan film festival bollywood movies

bahubali movie, bhusan film festival, oscar awards, bahubali records, bahubali collections, bahubali updates, director rajamouli, amul palekar, hero prabhas, rana daggubati, anushka shetty, tamanna bhatia, bahubali news

Bahubali Movie Oscar Race Bhusan Film Festival Bollywood Movies : Bahubali Movie Will Show On Bhusan Film Festival. It Is Also Selected For Oscar Awards.

ఆస్కార్ దిశగా అడుగులేస్తున్న జక్కన్న ‘బాహుబలి’

Posted: 08/29/2015 10:26 AM IST
Bahubali movie oscar race bhusan film festival bollywood movies

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన ‘బాహుబలి’ శిల్పం దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. అబ్బురపరిచే గ్రాఫిక్స్ తో హాలీవుడ్ స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిగా.. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం జులై 10వ తేదీన విడుదలై యాభై రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఇండియన్ బాక్సాఫీస్ లోనే కాకుండా యూఎస్ లోనూ ఈ చిత్రం రికార్డుల మోత మోగించి, ఇండియన్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు (ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.500 కోట్లపైనే) సాధించిన దక్షిణాది సినిమాగా నిలిచింది.

ఇన్ని సంచలనాలు సృష్టించిన ఈ సినిమాపై ఇప్పటికే పలు హాలీవుడ్ పత్రికలు సైతం ప్రశంసల వర్షం కురిపించాయి. టాలీవుడ్ లో ఏ సినిమాకి దక్కని గౌరవం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దక్కింది. ఇప్పుడు తాజాగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి కూడా ఈ సినిమా ఎంపికై మరిన్ని విశేషాలను నింపుకుంది. రాజమౌళి విజన్, సెట్టింగ్స్, హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో అలరించిన ‘బాహుబలి’.. తాజాగా భుసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. ప్రఖ్యాత భుసన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితం కానున్న విషయాన్ని రాజమౌళి స్వయంగా తెలియజేశారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’ సినిమా, అక్టోబర్ 4, 7, 9వ తేదీల్లో ప్రదర్శితం కానుంది. అక్టోబర్ 4న జరిగే ప్రదర్శనకు రాజమౌళి స్వయంగా హాజరు కానున్నారు. రాజమౌళితో పాటు సినిమా నిర్మాతలు, టీమ్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ‘బాహుబలి’ చిత్రం ‘ఆస్కార్’ దిశగా అడుగులేస్తోందని వార్తలు వస్తున్నాయి. 88వ ఆస్కార్ అవార్డుల జాబితాలో చోటు సంపాదించుకోవడానికి ‘బాహుబలి’ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దేశం నుంచి ఆస్కార్ కి వెళ్లే విదేశీ ఉత్తమ చిత్రం కేటగిరీ ఎంపిక జారీ బృందానికి ప్రముఖ నటుడు - దర్శకుడు అమోల్ పాలేకర్ చైర్మన్ గా వున్నాడు. తన బృందంతో కలిసి 45 భారతీయ చిత్రాలను పరిశీలించిన ఆయన, నామినేషన్ కి గాను కొన్ని చిత్రాలను ఎంపిక చేశాడు. వాటిలో తెలుగు నుంచి 'బాహుబలి' .. తమిళ నుంచి 'కాక్క ముట్టై' వున్నాయి. ఈ జాబితాలో పీకే.. హైదర్.. మేరీకోమ్.. మసాన్ వంటి బాలీవుడ్ చిత్రాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చివరికి ఏ చిత్రం ఎంపికవుతుందన్న విషయం త్వరలో తెలుస్తుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali movie  bhusan film festival  oscar awards  

Other Articles