Ram Charan And Srinu Vaitla Combo Movie Title Fixed As Bruce Lee The Fighter | Rakul Preet Singh | Tollywood

Ram charan tej srinu vaitla movie title fix bruce lee the fighter rakul preet singh

ram charan movie, ram charan bruce lee movie, ram charan updates, ram charan latest news, bruce lee telugu movie, cherry bruce lee movie, cherry bruce lee updates, ram charan bruce lee updates, ram charan rakul preet singh, ram charan srinu vaitla movie

Ram Charan Tej Srinu Vaitla Movie Title Fix Bruce Lee The Fighter Rakul Preet Singh : Finally Ram Charan's Latest Movie Fixed As Bruce Lee The Fighter. In This Movie Rakul Preet Singh Acted As Heroine For The First Time With Charan. This Movie Directed By Srinu Vaitla.

వరలక్ష్మీ కటాక్షంతో చెర్రీ చిత్రం టైటిల్ ఫిక్స్

Posted: 08/28/2015 06:41 PM IST
Ram charan tej srinu vaitla movie title fix bruce lee the fighter rakul preet singh

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ఎట్టకేలకు టైటిల్ ఫిక్సయ్యింది. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా టైటిల్ లేకుండా ఫస్ట్ లుక్స్, టీజర్ విడుదలవగా.. ఇప్పుడు తాజాగా వరలక్ష్మీ కటాక్షంతో ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘ది ఫైటర్’ అనే ట్యాగ్ లైన్ కలిగిన ఈ చిత్రంలో చెర్రీ పవర్ఫుల్ ఫైటర్ గా కనిపించనున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ టీజర్ లోని చెర్రీ చెప్పే డైలాగ్ ‘నీ మీటర్ పగిలితేగానీ, నా మీటర్ అర్థంకాదు’ సూపర్బ్ గా వుందంటూ చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తొలిసారి జతకడుతోంది. థమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందించిన ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా విడుదల కానున్నాయి.

ఇదిలావుండగా.. గతంలో విడిపోయిన దర్శకుడు శ్రీనువైట్ల, రచయిత కోన వెంకట్ ఈ చిత్రం కోసం మళ్లీ కలిశారు. కోన వెంకట్ తో విడిపోయిన అనంతరం శ్రీను తీసిన చిత్రాలు అంతగా విజయం సాధించని నేపథ్యంలో.. మంచి హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో అతనితో మళ్లీ జతకలిశాడు. ఇక ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం యావరేజ్ హిట్ కావడంతో.. ఈ ‘బ్రూస్ లీ’ చిత్రం ఘన విజయం సాధిస్తుందని చెర్రీ నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan bruce lee  srinu vaitla  rakul preet singh  

Other Articles