Neethu Krishna Vasu arrested

Actress neethu krishna vasu arrested

Malayalam actress Neethu Krishna Vasu arrested, actress Neethu Krishna Vasu arrested, Neethu Krishna Vasu arrested, Neethu Krishna Vasu latest news, Neethu Krishna Vasu stills, Neethu Krishna Vasu hot news, Neethu Krishna Vasu latest updates, Neethu Krishna Vasu

Actress Neethu Krishna Vasu arrested: The Malayalam actress Neethu Krishna Vasu (27) appeared for her visa interview at the US Consulate when one of the officials...

అడ్డంగా దొరికిపోయిన మల్లు బ్యూటీ

Posted: 08/27/2015 03:15 PM IST
Actress neethu krishna vasu arrested

మలయాళ నటి నీతూ కృష్ణవాసు(27)ను పోలీసులు అరెస్టు చేసారు. నకిలీ పత్రాలతో అమెరికా వెళ్లడానికి ప్రయత్నించిన ఈమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని పత్తనందిట్టకు చెందిన నీతూకృష్ణ అమెరికా వెళ్లేందుకు వీసా కోసం చెన్నె అమెరికన్ కాన్సులేట్ కు వచ్చింది. అక్కడ ఈ అమ్మడు సమర్పించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నకిలీవని తేలడంతో అక్కడి అధికారులు రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేసారు.

పోలీసుల విచారణలో నీతూ పలు ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది. రాజీ అనే సినీ నిర్మాత తనను సంప్రదించారని, అమెరికాలో జరిగే పలు వివాహ కార్యక్రమాల్లో డాన్స్ చేస్తే అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ తెలిపాడని, కానీ చెన్నైకు వెళ్లి వీసా తీసుకోవాలంటే రెండు లక్షలు ఖర్చవుతుందని, దీంతో తన దగ్గరున్న నగదు మొత్తం అతనికి అందజేసానని, కానీ అతడు తనని మోసం చేస్తాడని అనుకోలేంటూ చెప్పుకుంటూ వాపోయింది.

ప్రస్తుతం పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అలాగే ఈ విషయంలోని బ్రోకర్లైన రాజీ, కుంజుమోన్ ల కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి. నీతూకృష్ణ సహాయనటిగా నటించేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Neethu Krishna Vasu  Arrested  forged documents  hot stills  

Other Articles