Best Actors | movie release

Best actors movie release on 28 august

Best Actors Film Release Date, Nandu Best Actors Latest Trailer, Best Actors release date, Best Actors movie stills, Best Actors news, Best Actors, Best Actors posters, Best Actors stills, Best Actors trailers, Best Actors songs, Best Actors videos, Best Actors audio, Best Actors movie latest posters, Best Actors posters, Best Actors, Nandu, Best Actors Nandu, Best Actors, Nandu, Madhurima latest news, Madhurima latest stills, Madhurima hot stills, Madhurima

Best Actors movie release on 28 August: Actor Nandu upcoming film Best Actors. this film will be release on 28 August. Madhu nandan, abhishek maharshi, madhurima, shamili etc etc acts in lead roles.

ఆగష్టు 28న బెస్ట్ యాక్టర్స్ విడుదల

Posted: 08/27/2015 10:41 AM IST
Best actors movie release on 28 august

విభిన్నమైన కాన్సెప్ట్ ల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్ లో చిన్న చిత్రాలు తీసి పెద్ద విజ‌యాలు సాధిస్తున్న మారుతి టీం వ‌ర్క్స్ ప్రోడ‌క్షన్ లో సినిమా ల‌వ‌ర్స్ సిన‌మా బ్యాన‌ర్ లో మ‌రో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో సిద్దమైన చిత్రం బెస్ట్ యాక్టర్స్‌ . ఉర్వశి ధియోట‌ర్స్ అసోసియోష‌న్ తో ఈ చిత్రం చేస్తున్నారు. నందు, మ‌ధు నంద‌న్‌, అభిషెక్ మ‌హ‌ర్షి, న‌వీద్ , మ‌దురిమ‌, కేషా . క్రాతి, షామిలి, భార్గవి లు జంట‌లుగా న‌టిస్తున్నారు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాత‌గా అరుణ్ ప‌వ‌ర్ ని ద‌ర్శకునిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈరోజుల్లో, బ‌స్టాప్, ప్రేమ‌క‌థాచిత్రమ్‌, కొత్తజంట‌, ల‌వ‌ర్స్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన జీవ‌న్ బాబు(జె.బి) సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌ల ఆడియో సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌టంతో యూనిట్ స‌భ్యులు సంతోషంతో వున్నారు. ఇప్పడు రాఖిపౌర్ణమి సంద‌ర్బంగా ఈ చిత్రాన్ని అగ‌ష్టు 28న విడుద‌ల చేస్తున్నారు. అయితే ఈచిత్రానికి ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టిస్తున్న స‌ర్దార్‌గ‌బ్బర్‌సింగ్ ని ద‌ర్శక‌త్వం చేస్తున్న ప‌వ‌ర్ ద‌ర్శకుడు బాబి త‌న సెల్ఫి విడియోతో చిత్ర యూనిట్ కి విషెస్ చెప్పారు. అంతేకాదు యంగ్ హీరో సందీప్ కిష‌న్‌, ప్రముఖ క‌మెడియ‌న్స్ 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రి పృద్వి, శ్రీనివాస రెడ్డి, మ‌ధు, స‌త్య లు బెస్ట్ యాక్టర్స్ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలిపారు. అంతేకాకుండా ఈ చిత్రం విడుద‌ల‌కి అనేకమంది ఫ్యాన్స్ కూడా ఇలానే విషెస్ చెబుతున్నారు. నిన్నటి నుండి ఫేస్‌బుక్ లో వైర‌ల్ గా సిని ప్రేక్షకులు స్పందించ‌టం విశేషం. .

ఈ సంద‌ర్బంగా నిర్మాత కుమార్ అన్నంరెడ్డి మాట్లాడుతూ.. మారుతి టీంవ‌ర్క్స్ తో అనుభందంగా మా బ్యాన‌ర్ సినిమా ల‌వ‌ర్స్ సినిమా పై బెస్ట్ యాక్ట‌ర్స్ చిత్రాన్ని తీసాము. న‌వ్విస్తూనే చ‌క్కటి క్లైమాక్స్ ని అందిచాడు ద‌ర్శకుడు అరుణ్ ప‌వ‌ర్‌. న‌లుగురు అబ్బాయిలు, న‌లుగురు అమ్మాయిలు జీవితాల్లో మ‌రో కొంత‌మంది ఎంట‌ర‌య్యి వారి జీవితాల్ని ఎలా మార్చారు చివ‌ర‌కి ఏమ‌య్యింది అనేది చిత్రం. సెకండాఫ్‌లో స‌ప్తగిరి వచ్చి చేసే కామెడి కి ధియోట‌ర్ మెత్తం విజిల్స్ ప‌డ‌తాయి, ఈ చిత్రానికి సూప‌ర్‌డూప‌ర్ మ్యూజిక్ ద‌ర్శకుడు జె.బి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 28న విడుద‌ల చేస్తున్నాము. అయితే కేవ‌లం న‌వ్వుకునే వాళ్ళు మాత్రమే ఈచిత్రానికి రావాల‌ని మా విన్నపం. అని అన్నారు

అరుణ్ ప‌వ‌ర్ మాట్లాడుతు.. మారుతి గారికి ఈ క‌థ చెప్పాను, క‌థ కంటే క‌థ‌నం చాలా బాగుంద‌న్నారు. నిర్మాత కుమార్ గారికి చెప్పి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం న‌లుగు జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుంద‌నేది మెయిన్ కాన్సెప్ట్ వినోదంతో చెప్పాం. సెకండాఫ్ లో స‌ప్తగిరి చేసే అల్లరి అంతాఇంతా కాదు. అలానే అంద‌రూ న‌టీన‌టులు సూప‌ర్బ్ గాన‌టించారు. జె.బి గారు అందించారు. న‌వ్విస్తాం న‌వ్వక‌పోతే మా ధియోట‌ర్ కి ద‌గ్గర‌కి కూడా రావ‌ద్దని మా మ‌న‌వి. రెండు గంట‌లు నాన్‌స్టాప్ న‌వ్వించ‌ట‌మే మా ప్రయ‌త్నం అగ‌ష్టు 28న మీ ముందుకు వ‌స్తున్నాం.. మా చిత్రం విడుదల‌య్యి విజ‌యవంతం అవ్వాల‌ని కోరుకుంటూ అనేక ర‌కాలుగా ముఖ్యంగా సెల్ఫి విడియోస్ తో మా యూనిట్ ని విష్ చేసిన ప్ర‌ముఖుల‌కి, సిని అభిమానుల‌కి మా ధ‌న్యవాదాలు . అన్నారు

నందు, మ‌ధు నంద‌న్‌, అభిషెక్ మ‌హ‌ర్షి, న‌వీద్ , మ‌దురిమ‌, కేషా . క్రాతి, షామిలి, భార్గవి , స‌ప్తగిరి, తాగుబోతు ర‌మేష్‌, కుమార్‌సాయి త‌దిత‌రులు.. ఆర్ట్‌.. గోవింద్‌, పి.ఆర్.ఓ..ఏలూరు శ్రీను, కో-డైర‌క్ట‌ర్.. గౌత‌మ్ మ‌న్నవ‌, సంగీతం- జె.బి, ఎడిటింగ్.. ఉద్దవ్‌.ఎస్‌.బి, కెమెరా.. విశ్వ.డి.బి, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. దాస‌రి వెంక‌ట స‌తీష్‌, స‌హ‌-నిర్మాత‌లు.. సందీప్ సేన‌న్‌, అనీష్‌.ఎమ్‌.థామ‌స్‌, నిర్మాత‌.. కుమార్ అన్నంరెడ్డి, ద‌ర్శక‌త్వం- అరుణ్ ప‌వ‌ర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Best Actors  Nandu  Madhurima  Songs  Stills  Release date  

Other Articles

Today on Telugu Wishesh