NTR Latest New Look Still Released

Ntr latest new look still released

NTR Sukumar Movie First Look Still, NTR First Look Still, Ntr latest film shooting updates, Ntr latest news, Ntr movie news, Ntr movie updates, Ntr shooting details, Ntr latest stills, Ntr news, Rakul movies, Rakul

NTR Latest New Look Still Released: Young tiger Ntr upcoming film under Sukumar direction. Rakul preet singh heroine. Devi Sri prasad music. BVSN Prasad Producer. This movie first looks stills released today.

స్టైలిష్ బాద్ షా... యంగ్ టైగర్ లుక్ కేక

Posted: 08/14/2015 05:44 PM IST
Ntr latest new look still released

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్ లో జరుగుతోంది. లండన్ లో మొదలైన ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 20 వరకూ కంటిన్యూగా జరుగనుంది.

లండన్ లో ఇప్పటికే ఓ పాటను మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. లండన్ తర్వాత షెడ్యూల్ యూరప్ లో జరుగనుంది. అయితే తాజాగా రేపు ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే సంధర్భంగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ స్టైలిష్ లుక్ స్టిల్ ను విడుదల చేసారు.

ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

NTR Sukumar Movie First Look Still-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  First Look Still  Rakul preet singh  Sukumar  Movie News  

Other Articles