hero nitin bags surya 24 film telugu distribution rights

Hero nitin bags surya 24 film telugu distribution rights

nitin bags surya 24 film distribution rights, nitin bags surya 24 distribution rights, nitin got surya 24 rights, surya 24 movie news, surya 24 movie updates, surya 24 details, surya 24 stills, surya 24, Nithin, Samantha

hero nitin bags surya 24 film telugu distribution rights: Hero Surya upcoming film 24. Vikram kumar direction, Samantha heroine, AR Rahaman music.

నితిన్ చేతిలోకి సూర్య 24 రైట్స్

Posted: 08/12/2015 10:56 AM IST
Hero nitin bags surya 24 film telugu distribution rights

‘మనం’ ఫేం దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ‘24’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూర్య తన సొంత బ్యానర్ అయినటువంటి 2D ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మొదటినుంచే భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు మాంచి మార్కెట్ మొదలయ్యింది.

ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పలు సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. అయితే తెలుగులో విడుదల చేయడానికి చాలా మంది డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీపడ్డాయి. కానీ ఈ అవకాశాన్ని గ్లోబల మూవీస్ సంస్థతో కలిసి హీరో నితిన్ దక్కించుకున్నాడు.

శ్రేష్ట్ మూవీస్, గ్లోబల్ మూవీస్ సంయుక్తంగా ‘24’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. గతంలో నితిన్ ‘ఇష్క్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని అందించాడు విక్రమ్ కుమార్. ఆ పరిచయం వలనే నితిన్ కు ఈ అవకాశం దక్కినట్లుగా తెలిసింది.

ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడు. ఇందులో సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : surya 24  Nithin  distribution rights  samantha  movie news  

Other Articles