ramya krishna to act as cm jayalalitha in her biography role

Ramya krishna as tamilnadu chief minister

baahubali, ramya krishna, shivagami, rajini kanth, tollywood, kollywood, tamilanadu, jayalalitha, chief minister, jayalalithaa biography, ramya krishna latest updates, ramya krishna latest collections, ramya krishna updates, ramya krishnaforth comming movies, ramya krishna latest movie news, ramya krishna photos, ramya krishna latest news, ramya krishna movies, ramya krishna movie collections, ramya krishna updates, ramya krishna cinema News, ramya krishna upcomming movies

south indian actress and lady super star Ramya Krishna to act as chief minister jayalalitha in her biography role

తమిళనాడు ముఖ్యమంత్రిగా రమ్యకృష్ణ

Posted: 08/09/2015 06:37 PM IST
Ramya krishna as tamilnadu chief minister

ముఖ్యమంత్రి జయలలిత ప్రతిభావంతురాలు. చాలా ధైర్యవంతురాలు అంటూ పొగడ్తల వర్షం కరిపిస్తోంది దక్షిణాది నటి, లేడీ సూపర్ స్టార్ రమ్యక్రిష్ణ. నరసింహా చిత్రంలో నీలాంబరిగా రమ్యకృష్ణ అభినయం.. ఆ తరువాత పదిహేనేళ్లకు బాహుబలిలో శివగామిగా  నటవిశ్వరూపాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి.. నటించడంలో రమ్యకృష్ణకు రారు ఎవరు సాటి. సంబంధం లేకుండా ఈ ఉపోద్ఘాతం ఏమిటంటారా..? అమెకు తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని వుందట. నిజంగానే అంటే నిజంగానే. అయితే అది కేవలం వెండి తెరపైనేనంటోంది.

జ‌య‌లలిత జీవితచరిత్ర ఆథారంగా తెర‌కెక్కే సినిమాలో రమ్యకృష్ణా.. జయలలిత పాత్రను పోషిస్తోంద‌ని వార్తలొచ్చాయి. జయలలిత ఆటోబయోగ్రఫీలో ఈ సీనియర్‌ యాక్టర్‌ నటిస్తోందంటూ కోలీవుడ్‌లో వర్గాలు గుసగుసలాడుతున్నాయి జ‌య‌ల‌లిత క్యారెక్టర్‌లో ర‌మ్య మ‌రోసారి మెప్పిస్తుంద‌న్న చ‌ర్చలు కూడా జ‌రిగుతున్నాయి. ఆ పాత్రకు ఆమె అయితేనే క‌రెక్ట్ అని..జ‌య‌ల‌లిత కూడా సినీ న‌టి కావ‌డంతో ఆ క్యారెక్టర్ లో ర‌మ్య క‌రెక్టుగా ఒదిగిపోతుంద‌ని అనుకున్నారు. అయితే ఈ వార్తల‌పై ర‌మ్య స్పందిస్తూ అవ‌న్నీ పుకార్లేన‌ని చెప్పేసింది. త‌న‌ను ఈ విష‌య‌మై ఎవ్వరు సంప్రదించ‌లేద‌ని..అలాంటే ఛాన్సే వ‌స్తే ఎగిరి గంతేస్తాన‌ని చెపుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chief minister  tamilnadu  jayalalithaa  ramya krishna  jayalalithaa biography  

Other Articles