Nandamuri Balakrishna meets elder lady fan

Nandamuri balakrishna meets elder lady fan

Nandamuri Balakrishna meets old lady, Nandamuri Balakrishna latest news, Nandamuri Balakrishna movie news, Nandamuri Balakrishna movie updates, Balakrishna Dictator movie news, Balakrishna Dictator news, Balakrishna Dictator movie updates, Balakrishna Dictator stills, Balakrishna, Dictator

Nandamuri Balakrishna meets elder lady fan: Nandamuri Balakrishna latest upcoming film Dictator. Srivas direction, Anjali heroine.

పండగలా దిగివచ్చిన నందమూరి బాలయ్య

Posted: 07/28/2015 04:42 PM IST
Nandamuri balakrishna meets elder lady fan

నందమూరి బాలకృష్ణ ఒక కుటుంబంలో నేడు పెద్ద పండగ వాతావరణాన్ని నెలకోల్పారు. ఒక వృద్దురాలిని చాలా సంతోషానికి గురిచేసారు. ఇంతకీ ఆ సంతోషకరమైన విషయం ఏమిటంటే... బాలయ్య ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిక్టేటర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని గోపాలంపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.

అయితే బాలయ్య షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న ఓ 90 ఏళ్ల వృద్ధురాలు... బాలయ్యను ఎలాగైనా చూడాలని అనుకుంది. కానీ ఆమెది నడవలేని పరిస్థితి. కానీ ఎలాగైనా బాలయ్యను చూడాలంటూ తన కుటుంబసభ్యులను కోరిందట.

అయితే ఈ విషయం తెలుసుకున్న బాలయ్య స్వయంగా ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి, ఆ ఎన్టీఆర్ వీరాభిమానిని కలిసారు. ఆ వృద్ధురాలిని పలకరించి, క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఆవిడ కూడా బాలయ్య కుటుంబం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ను మరియు బాలయ్యను ఆవిడ ప్రశంసించారు.

బాలయ్య తమ ఇంటికి రావడం చాలా సంతోషంగా వుందని, ఇలా తమతో కాసేపు గడపడం అస్సలు మర్చిపోలేమని ఆ కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. మొత్తానికి బాలయ్య సినిమాలు, రాజకీయాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా మనసున్న బాలయ్య అంటూ మరోసారి నిరూపించుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  Movie News  Stills  Anjali  

Other Articles