Amitabh Bachchan Warns Anushka Sharma

Amitabh bachchan warns anushka sharma

Anushka Sharma latest tweets, Amitabh Bachchan Warns Anushka Sharma, Amitabh Bachchan tweets, Amitabh Warns Anushka, Anushka Sharma latest news, Anushka Sharma movies, Anushka Sharma movie updates, Anushka Sharma movie details, Anushka Sharma stills, Anushka Sharma hot stills, Anushka Sharma

Amitabh Bachchan Warns Anushka Sharma: Bollywood star Big B Amitabh Bachchan responds to Anushka Sharma's tweets. Anushka Sharma latest news, gossips, tweets, stills, gallery

జీవితంలో అలాంటి పని చేయనంటున్న అనుష్క

Posted: 07/28/2015 04:24 PM IST
Amitabh bachchan warns anushka sharma

అభిమానులు వారు అభిమానించే తారల గురించి అన్ని రకాల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు పలువిధంగా ప్రశ్నలను సంధిస్తూ వుంటారు. కొన్ని ప్రశ్నలు పర్వాలేదనిపించినా... మరికొన్ని ప్రశ్నలు చిరాకును తెప్పిస్తూ వుంటాయి.

ఇక ఈ సోషల్ మీడియాలో సినీతారలు పాల్గొంటున్న క్షణం నుంచి ఈ అభిమానుల ప్రశ్నల వర్షం మరింత ఎక్కువయ్యింది. తమ అభిమాన తారల గురించి బయట వినిపించే పలు పుకార్లపై సమాధానాలను నేరుగా ఆ తారలనే అడుగుతూ.. వారికి చిరాకు తెప్పిస్తూ వుంటారు.

ఇలా అభిమానుల ప్రశ్నల దాడి వలన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క శర్మ కూడా విసిగిపోయింది. దీంతో ఈ అమ్మడికి చిర్రెత్తుకొచ్చి అభిమానులపై గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్నింగ్ పై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ... అనుష్కకు రివర్స్ లో వార్నింగ్ ఇచ్చాడు.

అనుష్కకు ట్విట్టర్లో కొంతమంది అభిమానుల నుంచి వెకిలి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఈ అమ్మడికి ఒళ్లుమండి.... తన ట్విట్టర్లో అందరూ కూడా పాజిటివ్ గా వుండాలని కోరుకుంటున్నానని, ఈ సోషల్ మీడియా ద్వారా తనతో టచ్ లో వుండేవారు కూడా అలాగే వుండాలని, ఒకవేళ అలా లేనివారిని బ్లాక్ చేస్తానని అంటూ ట్వీట్ చేసింది.

అనుష్క ట్వీట్ పై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ... నన్ను బ్లాక్ చేసే ధైర్యం చేయకు.. ఊరుకోను అంటూ అనుష్కకు సరదాగా వార్నింగ్ ఇచ్చారు. అమితాబ్ ట్వీట్ పై అనుష్క స్పందిస్తూ... అది జరగని పని సార్.. జీవితంలో అలాంటి పని చేయను అంటూ చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  Warns  Anushka Sharma  Twitter  stills  

Other Articles