Shamili Got Offer In Vishal PandemKodi Sequel Tamil Movie As Lead Actress | Meera Jasmine

Shamili huge offer vishal pandemkodi sequel tamil movie meera jasmine

shamili, baby shamili, shamili latest photos, shamili with sister, shamili latest updates, shamili movies, shamili gallery, shamili photo shoot, vishal, actor vishal news, actor vishal pandemkodi, pandemkodi sequel movie, meera jasmine

Shamili Huge Offer Vishal PandemKodi Sequel Tamil Movie Meera Jasmine : After Oye Movie Shamili Got Huge Offer In Vishal's PandemKodi Sequel Movie As Lead Actress.

ఎట్టకేలకు షామిలిని ‘కోడి’ వరించింది..?

Posted: 07/25/2015 01:41 PM IST
Shamili huge offer vishal pandemkodi sequel tamil movie meera jasmine

బాలనటిగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన షామిలి.. ‘ఓయ్’ చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఆ సినిమా ఆమెకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె.. మళ్లీ ఏ సినిమా ఒప్పుకోలేదు. కొన్నాళ్ల తర్వాత తిరిగి అవకాశాల కోసం ప్రయత్నిస్తే.. ఈమెకు ఏ ఆఫర్ దక్కలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి తాజాగా ఓ భారీ సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది.

గతంలో విశాల్ హీరోగా నటించిన ‘పందెం కోడి’ సినిమా అటు తమిళంతోపాటు ఇటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసేందుకు విశాల్ ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది కూడా! ఇక ఇందులో హీరోయిన్ కోసం ఎంతోమందిని అన్వేషించారు. ఆ మధ్య ఈ సినిమాలో అగ్రకథానాయికలు నటించనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే.. చివరికి షామిలిని హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. అలాగే.. గతంలో వచ్చిన ‘పందెంకోడి’ సినిమాలో కథానాయికగా నటించిన మీరా జాస్మిల్ ఈ సీక్వెల్ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తోంది.

చాలా గ్యాప్ తర్వాత షామిలికి ఈ సీక్వెల్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆమె దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితే తనకు తదుపరి చిత్రాల్లో నటించేందుకు బోలెడన్ని ఆఫర్లు వచ్చిపడతాయని ఆశిస్తోంది. అటు.. కొంతకాలంగా ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోతున్న విశాల్ కూడా ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాడు. మరి.. వీరిద్దరి ఆశయాలు నెరవేరుతాయో లేదా తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shamili  vishal  pandemkodi sequel  meera jasmine  

Other Articles