Samantha Given Green Signal To Act Opposite Nitin | Trivikram Srinivas | Tollywood

Samantha green signal nitin trivikram movie tollywood

samantha, samantha latest news, trivikram srinivas, tollywood news, nitin news, nitin reddy, telugu actor nitin, actor nitin news, nitin trivikram movie, nitin samantha movie, samantha hot photo shoot

Samantha Green Signal Nitin Trivikram Movie Tollywood : Star Actress Samantha Given Green Signal To Act Opposite Nitin. This Project Is To Be Directed By Trivikram Srinivas.

ఆ హీరోతో రొమాన్స్ కి గ్రీన్ సిగ్నల్

Posted: 07/25/2015 12:54 PM IST
Samantha green signal nitin trivikram movie tollywood

ఇండిస్ట్రీలో ప్రస్తుతం యువతారల హవా కొనసాగుతుండటంతో స్టార్ హీరోయిన్ సమంతకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. నిత్యం బిజీబిజీగా గడిపే ఈ అమ్మడు ఆమధ్య కాస్త స్లో అయిపోయింది. దీంతో ఈమె ఇమేజ్ పడిపోయిందని.. ఇక సమంత సినిమాల్లో కనిపించడం అరుదు అని అనుకున్నారు. కానీ.. ఆ ఊహాగానాలను తిప్పికొడుతూ సమంత మళ్లీ బిజీ అయిపోయింది. ఈ అమ్మడికి మళ్లీ వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు సరసన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో కథానాయికగా ఎంపికైన ఈ బబ్లీ బ్యూటీ.. తాజాగా మరో భారీ ఆఫర్ ని దక్కించుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఈ సినిమాకోసం చాలామంది హీరోయిన్లను అన్వేషించిన అనంతరం తన ఫేవరైట్ హీరోయిన్ సమంతాని త్రివిక్రమ్ ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఈ ఆఫర్ రావడంతో సమంతా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఒప్పేసుకుందట. ఈ సినిమాలో ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ వుంటుందని అంటున్నారు. నిజానికి త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్లకు ఏదో ఒక లోపం వుంటుంది. కానీ.. ఈ సినిమాలో మాత్రం అందుకు భిన్నంగా సమంతా పాత్ర వుంటుందని చెబుతున్నారు. హీరో నితిన్ కి సమానంగానే ఆమె పాత్ర ఈ సినిమాలో కొనసాగుతుందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  trivikram srinivas  actor nitin  

Other Articles