Writer Madan Karky clarifies on Bahubali controversy

Writer madan karky clarifies on bahubali controversy

Madhan Karky apologizes on Bahubali issue, Bahubali movie latest updates, Bahubali movie collections, Bahubali hindi collections, Bahubali latest updates, Bahubali, Prabhas, Rana, Tamanna, Anushka, Ramya krishna

Writer Madan Karky clarifies on Bahubali controversy: Petrol bomb attack on bahubali theatre in madurai. Bahubali The Beginning Running Successfully in South India. Prabhas, Rana, Tamannah, Anushka, Ramya krishna acts in lead roles. SS Rajamouli diretion.

క్షమాపణలు కోరిన బాహుబలి రచయిత

Posted: 07/24/2015 12:12 PM IST
Writer madan karky clarifies on bahubali controversy

‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల మోత మోగిస్తుంటే ఇటీవలే ఈ సినిమాలో గిరిజనులను కించపరిచే విధంగా డైలాగులు, సన్నివేశాలు వున్నాయంటూ మధురైలో ‘బాహుబలి’ ప్రదర్శించబడుతున్న ఓ థియేటర్ పై తమిళ పులి సంస్థకు చెందిన కొంతమంది కార్యకర్తలు పెట్రోల్ బాంబ్ దాడి చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ వలన తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ, అందువల్ల వాటిని తక్షణమే తొలగించాలని వారు డిమాండ్ చేసారు. అయితే ఈ విషయంపై ‘బాహుబలి’ చిత్ర తమిళ వర్షెన్ కు మాటలు రాసిన రచయిత మదన్ కార్కీ ఎట్టకేలకు స్పందించాడు.

ఈ సినిమాలో తాను ఎవరినీ కించపరచడానికి డైలాగ్స్ రాయలేదని, అవి కేవలం సినిమాలోని పలు సన్నివేశాలకు అనుగుణంగా వచ్చాయని, ఒకవేళ ఎవరినైనా కించపరిచే విధంగా ఏమైనా డైలాగ్స్ వుంటే వాటిని తక్షణమే తొలగించడానికి ప్రయత్నాలు చేస్తానని మదన్ ఓ ప్రకటన విడుదల చేసాడు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్ల మోత మోగిస్తుంది. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, సత్యరాజ్, అనుష్క, ప్రభాకర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhan Karky  apologizes  Bahubali issue  Collections  Prabhas  

Other Articles