Anushka Rudramadevi Movie Release Date Confirmed

Anushka rudramadevi movie release date confirmed

Rudramadevi Release Date Fixed, Rudramadevi Movie News, Rudramadevi Movie Updates, Rudramadevi Movie Stills, Rudramadevi Movie Details, Rudramadevi Movie Trailers, Rudramadevi Movie Posters, Rudramadevi Movie

Anushka Rudramadevi Movie Release Date Confirmed: Actress Anushka upcoming film Rudhramadevi. Gunashekhar director. Anushka, Allu arjun, Rana acts in lead roles. Ilayaraja music. Movie will be release on 4 sep.

కన్ఫర్మ్: సెప్టెంబర్ 4న రుద్రమదేవి విడుదల

Posted: 07/24/2015 12:44 PM IST
Anushka rudramadevi movie release date confirmed

స్టార్ హీరోయిన్ అనుష్క, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. గుణా టీం వర్క్స్ బ్యానర్ పై శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఇళయరాజా సంగీతం అందించారు.

రుద్రమదేవి పాత్రలో అనుష్క, గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించారు. ఇక రానా, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, నిత్యామీనన్, కెథరిన్, హంసా నందిని, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే గతకొద్ది కాలంగా విడుదల కాకుండా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదిని ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Trailers  Posters  Anushka  Rana  Allu Arjun  

Other Articles