Srimanthudu | Namrata Shirodkar | Mahesh Babu

Namrata shirodkar talks about srimanthudu film

Namratha talks about Srimanthudu Movie, Namrata Shirodkar latest comments, Namrata Shirodkar hot news, Namrata Shirodkar latest updates, Namrata Shirodkar movies, Namrata Shirodkar stills, Srimanthudu Movie news, Srimanthudu Movie updates, Srimanthudu Movie release dates, Srimanthudu Movie posters, Srimanthudu Movie songs, Srimanthudu

Namrata Shirodkar Talks about Srimanthudu Film: Mahesh Babu srimanthudu film release on 7 august. koratala shiva director, Devi sri prasad music. shruti haasan heroine.

శ్రీమంతుడి కోసం బిజీగా మారిన నమ్రతా

Posted: 07/23/2015 01:22 PM IST
Namrata shirodkar talks about srimanthudu film

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఆగష్టు 7వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు.

ఎం.బి. ఎంటర్ టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ అనే పేరుతో ఇటీవలే మహేష్ ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్ పై ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ఈ ప్రొడక్షన్ బాధ్యతలన్నీ కూడా మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ చూసుకుంటున్నారు.

‘శ్రీమంతుడు’ సినిమాలో నటించినందుకు మహేష్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్స్ లో మాత్రమే కొంత షేర్ తీసుకోనున్నాడు. అయితే తమ ప్రొడక్షన్ హౌస్ గురించి మరియు శ్రీమంతుడు చిత్ర విశేషాల గురించి నమ్రతా ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

‘శ్రీమంతుడు’ సినిమా మార్కెటింగ్ కు సంబంధించిన భాధ్యత అంతా కూడా తానే తీసుకున్నానని తెలిపింది. ఈ బాధ్యత చాలా ఆసక్తికరంగానూ, ఉత్కంఠగా వుందని నమ్రతా తెలిపింది. అంతేకాకుండా ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ తో అసోసియేట్ అయ్యి పనిచేయడం, తనని తాను బిజీగా వుంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతోందని నమ్రతా చెప్పుకొచ్చింది.

మహేష్, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తుంది. జగపతిబాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, రాహుల్ రవీంద్రన్, పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Namrata Shirodkar  Mahesh Babu  Trailers  Songs  

Other Articles