Baahubali Poster | Guinness World Records | Prabhas

Baahubali poster enters guinness world records

Baahubali Poster Breaks Guinness World Records, Baahubali movie news, Baahubali movie updates, Baahubali stills, Baahubali collections, Baahubali film records, Baahubali stills, Baahubali latest trailers, Baahubali songs, Baahubali videos, Baahubali

Baahubali Poster Enters Guinness World Records: SS Rajamouli Direction, MM Keeravani Music. Prabhas, Rana, Anushka, Tamannah acts in lead roles. The Guinness World Records on Wednesday approved the poster created during the audio launch of S.S Rajamouli's magnum opus Baahubali

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలుకొట్టిన బాహుబలి పోస్టర్

Posted: 07/23/2015 10:59 AM IST
Baahubali poster enters guinness world records

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ అభిమానులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీ గుర్తింపును తెచ్చుకున్న ‘బాహుబలి’ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి రావడం తెలుగువారికి గర్వకారణం అంటూ ప్రశంసలు లభిస్తున్నాయి.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ కలెక్షన్ల మోత మోగిస్తుంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా భారీ బడ్జెట్ తో నిర్మించింది.

అయితే ఈ చిత్రం మలయాళ వర్షెన్ ఆడియో విడుదల సమయంలో ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన ఓ అతిపెద్ద పోస్టర్ ను ఆవిష్కరించి గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం పంపిన విషయం తెలిసిందే. సుమారు 4,793 చ.మీటర్ల ఈ పోస్టర్ ప్రపంచంలోనే అతిపెద్ద పోస్టర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఈ విషయాన్ని గిన్నిస్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

ఈ విషయంతో ‘బాహుబలి’ చిత్ర యూనిట్ తో పాటుగా మలయాళం ‘బాహుబలి’ వర్షెన్ వారు కూడా చాలా సంతోషంగా వున్నారు. మొత్తానికి ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా భీభత్సంగా దుమ్ముదులిపేస్తుంది. ఇప్పటికే 300ల కోట్లకు పైగా వసూలు చేసి 400 కోట్లను కొల్లగొట్టేందుకు దూసుకుపోతుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం రెండవ భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Poster  Guinness World Records  Prabhas  Rajamouli  

Other Articles