Ntr sukumar latest film shooting updates

Ntr sukumar latest film shooting updates

Ntr latest film shooting updates, Ntr latest news, Ntr movie news, Ntr movie updates, Ntr shooting details, Ntr latest stills, Ntr news, Rakul movies, Rakul

Ntr sukumar latest film shooting updates: Young tiger ntr upcoming film shooting in london. Sukumar direction. Rakul preet singh heroine. Devi Sri prasad music. BVSN Prasad Producer.

లండన్ లో యంగ్ టైగర్ హల్చల్

Posted: 07/18/2015 09:29 AM IST
Ntr sukumar latest film shooting updates

సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రకూల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్ లో జరుగుతోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన యూనిట్.. తొలి షెడ్యూల్ ను ఓ పాట షూటింగ్ తో ప్రారంభించారు.

డాన్స్ మాస్టర్ రాజుసుందరం నేతృత్వంలో ఎన్టీఆర్, రకూల్ లపై ఓ పాటను చిత్రీకరించారు. ఈ పాట షూటింగ్ ను తాజాగా పూర్తి చేసుకున్నారు. అయితే సాంగ్ షూటింగ్ అయిపోయిన వెంటనే ప్రస్తుతం యాక్షన్ సీన్లలో ఎన్టీఆర్ బిజీ అయ్యాడు. ప్రస్తుతం పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.

లండన్ లో మొదలైన ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 20 వరకూ కంటిన్యూగా జరుగనుంది. ఆ తర్వాత షెడ్యూల్ యూరప్ లో జరుగనుంది. ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntr  Rakul preet singh  Sukumar  Movie News  

Other Articles