Srimanthudu movie another stylish look poster release

Srimanthudu movie another stylish look poster release

Mahesh Srimanthudu another stylish look poster, Mahesh Srimanthudu Audio Venue Details, Mahesh Srimanthudu Release Date Confirmed, Srimanthudu Release Date Confirmed, Srimanthudu movie latest news, Srimanthudu release date, Srimanthudu movie officially confirmed, Srimanthudu movie updates, Srimanthudu updates, Srimanthudu movie release confirmed, Srimanthudu audio date, Srimanthudu

Srimanthudu movie another stylish look poster release: Tollywood Prince Mahesh babu upcoming film Srimanthudu. Koratala siva direction. Devi Sri Prasad Music. Audio will be release on 18 july. film will be release on 7th August.

వారెవ్వా... శ్రీమంతుడు స్టైలిష్ లుక్ అదిరింది!

Posted: 07/14/2015 09:02 AM IST
Srimanthudu movie another stylish look poster release

టాలీవుడ్ లో మళ్లీ ప్రిన్స్ మహేష్ బాబు హవా మళ్లీ మొదలయ్యింది. గత రెండు నెలలుగా ‘బాహుబలి’ సినిమా తన హవాను కొనసాగించింది. ‘బాహుబలి’ సినిమా ఇటీవలే విడుదలై అన్నిచోట్ల మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ‘బాహుబలి’ తర్వాత అభిమానులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘శ్రీమంతుడు’.

మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల లోనే విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల ఆలస్యం వల్ల వాయిదా పడింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ‘శ్రీమంతుడు’ చిత్రంలోని మహేష్ కు సంబంధించిన మరో పోస్టర్ ను విడుదల చేసారు.

ఇందులో మహేష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈరోజుతో మళ్లీ మహేష్ తన హవాను ప్రారంభించేసాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. మహేష్ సరసన శృతిహాసన్ తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తుంది.

యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈ నెల 18న గ్రాండ్ గా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆడియో వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరుపనున్నారు. ఇదే రోజున చిత్ర థియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు.

ఇందులో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 7వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటించనున్నారు.

Mahesh Srimanthudu another stylish look poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Mahesh Babu  Latest poster  Shruti haasan  

Other Articles