Kedi Birla Killadi Ranga dubbing into telugu

Kedi birla killadi ranga dubbing into telugu

Sivakarthikeyan Kedi Birla Killadi Ranga into telugu, Kedi Birla Killadi Ranga movie updates, Kedi Birla Killadi Ranga movie details, Kedi Birla Killadi Ranga into telugu, Kedi Birla Killadi Ranga telugu stills, Kedi Birla Killadi Ranga news, Kedi Birla Killadi Ranga movie posters, Kedi Birla Killadi Ranga, Sivakarthikeyan, Regina, bindhu madhavi

Kedi Birla Killadi Ranga dubbing into telugu: Shivakarthikeyan, Vimal tamil block buster hit film Kedi Birla Killadi Ranga. Regina, bindhu madhavi heroines. pandiraj direction.

త్వరలోనే కేడి బిల్లా కిలాడి రంగా డబ్బింగ్

Posted: 07/13/2015 05:24 PM IST
Kedi birla killadi ranga dubbing into telugu

ఇటీవలే ‘శీనుగాడి లవ్‌స్టోరి’ చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘భీమవరం టాకీస్‌’ తాజాగా మరో సూపర్‌హిట్‌ తమిళ చిత్రం తెలుగు అనువాద హక్కుల్ని కైవసం చేసుకొంది. ‘పసంగ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై.. ‘గోలీసోడా’ వంటి సెన్సేషనల్‌ హిట్స్‌ ఇచ్చి.. తమిళంలో టాప్‌ డైరెక్టర్స్‌గా ఒకరిగా కొనసాగుతున్న పాండీరాజ్‌ దర్శకత్వంలో రూపొంది.. భారీ విజయం సొంతం చేసుకొన్న ‘కేడి బిల్లా - కిలాడి రంగా’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మపల్లి రామసత్యనారాయణ.

విమల్‌, శివకార్తికేయన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రెజీనా, బిందుమాధవి హీరోయిన్లు కావడం ఒక విశేషం. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్‌ శంకర్‌రాజా సంగీత దర్శకుడు. ఈ సందర్భంగా భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘పసంగ, మెరీనా, గోలీసోడా’ వంటి సెన్సేషనల్‌ హిట్స్‌ ఇచ్చిన యువ ప్రతిభాశాలి పాండీరాజ్‌ దర్శకత్వంలో రూపొంది తమిళంలో సంచలన విజయం సాధించిన ‘కేడి బిల్లా - కిలాడి రంగా’ చిత్రం తెలుగు హక్కుల కోసం చాలామంది పోటీపడినప్పటికీ.. ఈ చిత్రం హక్కులు మాకు దక్కడం చాలా గర్వంగా భావిస్తున్నాం. ఈ అనువాద చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన విమల్‌, శివకార్తికేయన్‌ ల నటన, రెజీనా, బిందుమాధవి గ్లామర్‌, యువన్‌ శంకర్‌రాజా సంగీతం, పాండీరాజ్‌ దర్శకత్వ ప్రతిభ ‘కేడి బిల్లా - కిలాడి రంగా’ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలోనే డబ్బింగ్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం’ అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: విజయ్‌, మ్యూజిక్‌: యువన్‌శంకర్‌రాజా, నిర్మాత: తుమ్మపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే్-దర్శకత్వం: పాండీరాజ్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sivakarthikeyan  Kedi Birla Killadi Ranga  Regina  Bindu Madhavi  

Other Articles