Prabhas Baahubali Tamil Movie Censor Report

Prabhas baahubali tamil movie censor report

Baahubali Tamil Movie Censor Report, Bahubali Movie Tickets Prices, Baahubali Movie Tickets Online Booking, Baahubali movie post production updates, Baahubali release date, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Prabhas Baahubali Tamil Movie Censor Report: Studio Green - K.E. Gnanavel Raja proudly presents Baahubali. Baahubali movie Censor process completed. Baahubali gets UA certificate. Rajamouli Direction, Keeravani Music.

తమిళంలో కూడా బాహుబలి సెన్సార్ పూర్తి

Posted: 07/03/2015 09:56 AM IST
Prabhas baahubali tamil movie censor report

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి - ది బిగెనింగ్’ చిత్రం ఈనెల 10వ తేదిన గ్రాండ్ గా విడుదలకానున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర తెలుగు వర్షెన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. అయితే తాజాగా తమిళ వర్షెన్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. తమిళ వర్షెన్ లో కూడా U/A సెన్సార్ సర్టిఫికెట్ లభించింది.

‘బాహుబలి’ తమిళ వర్షన్‌ను స్టూడియో గ్రీన్ సంస్థ భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మించింది.

భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో జులై 10న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. ఇందులో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Censor Report  Prabhas  Studio Green  Tamil News  

Other Articles