Rana in Siima Awards 2015 Press Meet

Rana in siima awards 2015 press meet

Rana at ‪SIIMA‬ Awards 2015 Press Meet, SIIMA‬ Awards 2015 Press Meet, SIIMA Telugu Nomination List 2015, SIIMA 2015 Telugu Nomination List, SIIMA Nomination List 2015, SIIMA Awards Telugu Nomination List 2015, SIIMA Telugu Nomination 2015, SIIMA Telugu Nominations 2015

Rana in Siima Awards 2015 Press Meet: Daggubati Rana talks about siima awards 2015. The biggest and the most anticipated South Indian International Movie Awards- SIIMA is back with its 4th edition of awards on the 6th& 7th August in Dubai.

వెంకీ కంటే చైతూకి అవార్డ్ వస్తేనే బాగుంటుందట!

Posted: 07/02/2015 12:28 PM IST
Rana in siima awards 2015 press meet

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుకలు ప్రతి ఏడాది ఘనంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. సైమా నాలుగవ పురస్కారాల వేడుకను దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో వచ్చే నెల 6, 7వ తేదిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సైమా అవార్డుల కార్యక్రమం విశేషాలను తెలియజేయడానికి తాజాగా ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో హీరో రానా, హీరోయిన్లు శ్రియ, కృతి కర్బందా, పూజా హెగ్డే, ఆదాశర్మ, షర్మిలా మాండ్రేలు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా హీరో రానా మాట్లాడుతూ...  సైమాలో పాల్గొనడం ఓ మధురమైన జ్ఞాపకం. దక్షిణాది చిత్ర పరిశ్రమలోని నాలుగు సినీ ఇండస్ట్రీలో కలిసి అంతర్జాతీయ స్థాయిలో పురస్కార వేడుక జరుపుకుంటున్నాయి. ఈ ఏడాది నాలుగు భాషల నుంచి అద్భుతమైన చిత్రాలొచ్చాయి. సైమా వేడుక ఈసారి మరింత గ్రాండ్ గా జరుగబోతుంది అని అన్నారు. అయితే ‘ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికైతే బాగుంటుంది’ అంటూ మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు రానా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

రానా మాట్లాడుతూ... ఈ సైమా పోటీలో లేకపోయినప్పటికీ అక్కినేని నాగేశ్వరరావు గారికి పురస్కారం ఇవ్వడమే సముచితమని భావిస్తున్నాను అని అన్నారు. అలాగే వెంకటేష్, నాగచైతన్య కూడా పోటీలో వున్నారు కదా? మరి వారిలో ఎవరికి వస్తే బాగుంటుందని అడగగా... వెంకటేష్ గారికి చాలా అవార్డులొచ్చాయి. ఆయనకు ఇపుడు సైమా అవార్డు వస్తే దాన్ని నేనే తీసుకురావాల్సి వుంటుంది. అందుకే నాగచైతన్యకు వస్తే బాగుంటుందని అనుకున్నానని రానా అన్నారు.

సైమా అవార్డులకు నామినేట్ అయిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. SIIMA

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  ?SIIMA? Awards 2015  Press Meet  Stills  Nominations  

Other Articles