Rakul preet singh clarifies on mahesh Brahmotsavam

Rakul preet singh clarifies on mahesh brahmotsavam

Rakul preet singh about mahesh babu, Rakul preet singh talks about brahmotsavam, Rakul preet singh movie news, Rakul preet singh movie updates, Rakul preet singh latest news, Rakul preet singh movies, Rakul preet singh stills, Rakul preet singh

Rakul preet singh clarifies on mahesh Brahmotsavam: Actress Rakul preet singh clarifies on mahesh Brahmotsavam film reject. Rakul preet singh latest film kick2 will be release soon.

మహేష్ ఆఫర్ మిస్సయినందుకు రకూల్ ఫీలవుతోందట

Posted: 06/30/2015 04:04 PM IST
Rakul preet singh clarifies on mahesh brahmotsavam

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం హిట్టుతో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది లక్కీ హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్టు అవుతుండడంతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస చిత్రాలతో బిజీగా వుంది.

అయితే లక్కీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘బ్రహ్మోత్సవం’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ముందుగా రకూల్ ను సంప్రదించారు. కానీ ఈ సినిమా కోసం కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్టును తిరస్కరించింది రకూల్.

ఈ విషయంపై తాజాగా రకూల్ స్పందిస్తూ.. మహేష్ ‘బ్రహ్మోత్సవం’ కోసం నేను డేట్స్ ఇచ్చాను. ఈ చిత్ర టీం జులై నెలలోనే కావాలన్నారు. కానీ ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా వున్నాను. జులై నెలలో నేను ఈ రెండు చిత్రాలతో బిజీగా వుండటం వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

మొత్తానికి మహేష్ తో వచ్చిన ఆఫర్ పోయిందని రకూల్ బాగానే బాధపడుతోంది. ఈ అమ్మడికి లక్కు బాగా వుంటే త్వరలోనే మళ్లీ మహేష్ తో కలిసి నటిస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం రకూల్ నటించిన ‘కిక్2’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rakul preet singh  Mahesh Babu  Brahmotsavam  Hot stills  

Other Articles